ఆలివ్స్ ని తీసుకుంటే.. ఈ సమస్యలు దూరం..!

-

చాలామంది ఆలివ్స్ ని తీసుకుంటూ ఉంటారు. వీటి వలన అనేక రకాల మనం పొందొచ్చు సలాడ్, సాండ్విచ్, పాస్తా, పిజ్జా వంటి వాటిల్లో ఎక్కువగా చాలా మంది వాడుతూ ఉంటారు ఆరోగ్యానికి వీటి వలన అనేక లాభాలు కలుగుతాయి. ఆలివ్స్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఆలివ్స్ లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దానితో పాటుగా విటమిన్ ఈ ఐరన్ కాపర్ క్యాల్షియం కూడా ఉంటాయి.

 

వీటిని తీసుకుంటే పోషకాహార లోపం కలగకుండా ఉంటుంది ఆలివ్స్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడిని ఆలివ్స్ తగ్గించగలవు. వీటిని తీసుకుంటే కణాలు ఆరోగ్యంగా మారుతాయి. ఆలివ్స్ ని తీసుకోవడం వలన ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి ఆలివ్స్ ని తీసుకోవడం వలన మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ఆలీవ్లలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇంఫ్లమేషన్ ని తగ్గిస్తాయి ఆలివ్స్ ని తీసుకుంటే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. కడుపు నిండిన ఫీలింగ్ మీకు కలుగుతుంది దీంతో ఏ ఆహారాన్ని పడితే ఆహారాన్ని మీరు తీసుకోరు. వీటిని తీసుకుంటే యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ ముప్పు ఉండదు. కొవ్వుని కూడా ఇది కరిగించగలదు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది చర్మాన్ని కూడా అందంగా మార్చగలదు. ఇలా ఆలివ్స్ తో ఇన్ని లాభాలను పొంది ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news