వ్యవస్థలను నాశనం చేసే వ్యక్తులు సీఎంగా ఉన్నప్పుడు స్త్రీలే తిరగబడాలని జగన్ ను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.మగవాళ్లు భయపడినా.. మహిళలు భయపడకూడదని కోరారు. ఏపీలోని ఓ జిల్లాలో మాన భంగాలు చేస్తామని స్త్రీలను బెదిరించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. స్త్రీలు ఇంకా బలహీనంగానే ఉన్నారని..30 వేల మంది ఆడపిల్లలు ఏపీ నుంచి మాయమైతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు.
పిల్లలు.. మహిళలు చాలా బలహీనంగా ఉన్నారని.. స్త్రీలకు సరైన స్థానం ఇస్తాం.. రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీఎం నివాసం ఉన్న ప్రాంతంలో అత్యధికంగా క్రైమ్ ఉందని..దీనిపై మహిళా కమిషన్ మాట్లాడదన్నారు. ఇలాంటి పరిస్థితులుంటే ఎన్ని చట్టాలు పెట్టినా.. స్పందన కార్యక్రమాలు పెట్టినా లాభమేంటీ..? అనకాపల్లి విస్సన్నపేట భూముల పరిశీలనకు వెళ్తే తన బిడ్డను చంపేశారని ఓ మహిళ వచ్చి నాకు చెప్పిందని వివరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
స్పందన కార్యక్రమంలో చెప్పినా లాభం లేదని వాపోయింది…ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న మీకు డేటా ఎక్కడిదని చిత్తూరు జిల్లా ఎస్పీ అడిగారన్నారు. బాధితులు వచ్చి నాకు మొరపెట్టుకుంటున్నారు.. వాళ్లిచ్చిన డేటాతోనే నేను మాట్లాడుతున్నానని ఆ ఎస్పీకి చెబుతున్నాను….రుషికొండను ఆక్రమించుకోవడమంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను పాటించక పోవడమేనని వెల్లడించారు.