ఆపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. మంచి పోషక పదార్థాలు ఉన్న ఈ పండును తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను తరిమికొట్టొచ్చు. అయితే ఆపిల్స్(apples) తినేటప్పుడు సరైన సమయంలో తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. లేదు అంటే నెగటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంది.
సరైన సమయంలో ఆపిల్ తీసుకోకపోతే విపరీతమైన కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఏ సమయంలో ఆపిల్ తీసుకోవడం మంచిది కాదు..?
డాక్టర్ చెప్పిన దాని ప్రకారం రాత్రిపూట అసలు యాపిల్ తీసుకోవడం మంచిది కాదు. రాత్రిపూట
ఆపిల్ తినడం వల్ల అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రాత్రిపూట ఆపిల్ తింటే కడుపు నొప్పి, కాన్స్టిపేషన్ లేదా గ్యాస్ సమస్యలు వస్తాయి. కనుక ఎప్పుడూ ఆపిల్ ని ఉదయం పూట మాత్రమే తీసుకోవాలి.
ఆపిల్ తినడం వల్ల కలిగే లాభాలు:
ఉదయం పూట ఆపిల్ తీసుకోవడం వల్ల దానిలో ఉండే ఫైబర్ కాన్స్టిపేషన్ లాంటి సమస్యలను దూరం చేస్తుంది. అలానే ఆపిల్ లో యాంటీ ఇంఫ్లమ్మెటరీ గుణాలు ఉన్నాయి ఇది రోగనిరోధక శక్తిని మరింత పెంచుతుంది.
అలానే దీనిలో విటమిన్ సి కూడా ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఆపిల్ బాగా మేలు చేస్తుంది. కనుక ఆపిల్ ని తినేటప్పుడు కచ్చితంగా ఉదయం పూట మాత్రమే తీసుకోండి రాత్రిపూట అసలు తీసుకోవద్దు దీని వల్ల సమస్యలు వస్తాయి.