భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. దానితో పాటుగా పూజలు కూడా చేస్తారు. అంతేకాదు ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రముఖ ఔషదాలలో తులసి కూడా ఒకటి. తులసి ఆకుల వల్ల ఎన్ని ప్రయోజనాలు పొందవచ్చొ తెలుసుకోవాలనుకుంటే దీనిని పూర్తిగా చూసేయండి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
తులసి ఆకులు లేదా తులసి పొడిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. దాని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు ఎటువంటి ఇన్ఫెక్షన్ నుండైనా మనల్ని కాపాడుకోవచ్చు. ఈ విధంగా తులసి ఆకులు ఎంతో సహజంగా పనిచేస్తాయి.
బ్లడ్ ప్రెజర్ మరియు కొలెస్ట్రాల్ :
తులసి ఆకులు వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. దానివల్ల గుండె ఆరోగ్యం మరియు గుండె జబ్బులను తగ్గించడానికి తులసి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దానితో పాటుగా కొలెస్ట్రాల్ శాతం తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి తులసి ఆకులను లేదా పొడిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.
జ్వరం తగ్గుతుంది:
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి తులసి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి వైరల్ జ్వరం అయినా తులసి ఆకులను తీసుకోవడం వల్ల తగ్గుతుంది. తులసి ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల జ్వరంతో పాటుగా దగ్గు, జలుబు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా తగ్గించుకోవచ్చు.
ఆయిల్ స్కిన్:
తులసి ఆకులతో ఆయిల్ స్కిన్ కు చెక్ పెట్టవచ్చు. తులసి పొడిని మొహానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మం పై ఉండే జిడ్డు వంటి వ్యర్ధ పదాలు తొలగిపోతాయి. ఈ విధంగా సహజమైన పద్ధతిలో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.