ఈ అలవాట్లను మానేయండి.. లేదంటే బట్టతల ఖాయం! మహిళలు కూడా

-

బట్టతల అనేది కేవలం పురుషులకు మాత్రమే కాదు. మహిళలకు కూడా వస్తుంది. నేటి మహిళలు అధికంగా తమ జుట్టును ఎక్కువగా కోల్పోతున్నారు. ఎందుకంటే ఒత్తిడితో కూడిన జీవన విధానం జుట్టు రాలడానికి ప్రధాన కారణం. ఒత్తిడి వారి శరీరంలో ఎక్కువ ఆండ్రోజెన్ల (మగ హార్మోన్ల) ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా జుట్టు రాలడానికి కారణమయ్యే రసాయనం DTH స్రావం పెరగుతుంది.

బట్టతలకు దారితీసే 5 ప్రధాన తప్పులు
1. ప్రతిరోజూ చేసే పెద్ద తప్పేంటంటే.. బిజీ తీవితంలో తడి జుట్టుతో ఉండడం. దీనివల్ల జుట్టు రాలడం, చిట్లడం జరుగుతుంది. కాబట్టి జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే జుట్టును దువ్వాలి.
2. చాలామందికి ఎప్పుడూ టోపీలు ధరించే అలవాటు ఉంటుంది. దీనివల్ల జుట్టుకు సరైన ఆక్సిజన్‌ సరఫరాను కోల్పోతుంది. జుట్టు మూలాలు బలహీనపడడం ప్రారంభమవుతుంది.
3. నేటి యువకులు హెయిర్‌ ైస్టెల్స్‌ కోసం రసాయనాలతో నిండిన హెయిర్‌ ైస్టెలింగ్‌ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టుకు చాలా నష్టం చేస్తుంది. హెయిర్‌ జెల్‌ వాడడం వల్ల జుట్టు బలహీనంగా మారి బట్టతలకు దారితీస్తుంది.
4. చాలామంది జుట్టుకు షాంపూ చేసిన తర్వాత కండీషనర్‌ వాడరు. షాంపూలో అనేక రకాల రసాయనాలు ఉంటాయి. కాబట్టి షాంపూ చేసిన తర్వాత కండీషనర్‌ ఉపయోగించడం మర్చిపోవద్దు.
5. ప్రతిరోజూ జుట్టు షాంపూ పెట్టడం వల్ల జుట్టు బలహీన పడడం, పలుచగా మారడం, జట్టు రాలడంతో బట్టతలకు కారణం అవుతుంది. వారానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే
షాంపూతో స్నానం చేయండి.

జుట్టు రాలడానికి కారణాలు :
– జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి మహిళలు ఎక్కువగా రంగు వేసుకోవడం. వేడి మరియు రసాయనాలు జుట్టు బలహీనంగా పెళుసుగా మార్చుతాయి.
– వారానికి కనీసం మూడు రాత్రులైనా తలను తేమగా ఉంచుకోవాలి. దానికోసం కొబ్బరి నూనె లేదా బాదంనూనె వాడాలి. తలకు నూనె రాసిన మరుసటి ఉదయం తలస్నానం చేయాలి. ప్రతివారంలో జుట్టు చిట్లుతుంటే జుట్టు చివరలను కత్తిరించడం కూడా మంచిదే. నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధకాలు కూడా జుట్టు రాలడానికి ముఖ్య కారణం.
– సర్వ రోగాలకు మూలం ప్రాణాంతక జంతువు ధూమపానం. ఈ అలవాటు ఉంటే కచ్ఛితంగా వెంటనే మానేయాలి. లేదంటే బట్టతల రావడానికి ఎక్కువ అవకాశం ఉంది.
– ధూమపానంతో పాటు మద్యపానం కూడా హానికరమే. ఇది ఆరాగ్యోనికే కాదు, జుట్టు పెరుగుదలకు హానికలిగిస్తుంది.
– ఆఫీసు పనులు, ఇంటి పనులతో ఒత్తిడి ఎక్కువై సతమతమవుతుంటారు. దీంతో సరిగా నిద్ర కూడా పట్టదు. నిద్రలేమి కారణంగా జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. ఒత్తిడి వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అందుకు యోగా చేయడం మంచిదంటారు ఆరోగ్య నిపుణులు

జుట్టు రాలే సమస్యను ఎలా నియంత్రించాలి :
మంచి ఆహారం తీసుకోవాలి. జుట్టు పెరుగుదలను గమనించండి. జుట్టు కెరాటిన్‌ అనే ప్రోటీన్‌ నుంచి తయారవుతుంది. అందువల్ల తీసుకునే ఆహారంలో సరైన మొత్తంలో ప్రోటీన్‌ ఉండేలా చూసుకోవాలి. తక్కువ ప్రొటీన్లు కలిగున్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కణాల పునర్నిర్మాణం వంటి ఇతర పనుల కోసం ప్రోటీన్‌ను ఆదా చేస్తుంది. కాబట్టి జుట్టు కోల్పోవాల్సి వస్తుంది. పాలక్‌ సూప్‌, బాదం, అక్రోట్లను, పన్నీర్‌, పాలు జట్టు పెరుగడానికి గొప్పగా సహాయపడుతాయి. గ్రీన్‌ టీ పనిచేస్తుంది. ఎందుకంటే జుట్టు రాలడానికి కారణమయ్యే డైహైడ్రోటెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ను నిరోధిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news