ఇంట్లో పండ్ల రసాలు చేసేటప్పుడు ఈ తప్పులు చెయ్యద్దు..!

-

పండ్ల రసాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఇళ్లల్లో జ్యూసులు తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ తప్పులు కనుక చేయకుండా ఉంటే జ్యూస్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా అల్పాహారం తీసుకున్న టైంలో జ్యూస్ తీసుకునేటపుడు మరింత శ్రద్ధ వహించాలి. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రూట్స్
ఫ్రూట్స్

ఇంట్లో మీరు కనుక జ్యూస్ తయారు చేసుకున్నారు అంటే జ్యూసర్ వేడిగా ఉండకుండా చూసుకోవడం మంచిది. బాగా వేడిగా ఉన్న జ్యూసర్ లో జ్యూస్ చేయడం వల్ల దానిలో ఉండే పోషక పదార్థాలు అన్నీ కూడా పోతాయి.

అదే విధంగా నార్మల్ టెంపరేచర్ లోనే జ్యూస్ తాగడం మంచిది. లేదు అంటే అందులో పోషక పదార్ధాలు ఉండవు.

అలానే చాలా మంది జ్యూస్ చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెడతారు. అది కూడా మంచిది కాదు. తాజా పండ్ల రసాలు తీసిన తర్వాత ఫ్రిజ్లో పెట్టకుండా తాగడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

అలానే రుచి కోసం పంచదారని జ్యూస్ లో వేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే పండ్లలో సరిపడా షుగరు ఉంటుంది కాబట్టి మళ్లీ షుగర్ వేయడం మంచిది కాదు. కాబట్టి ఈ అలవాటు ఉన్న వాళ్ళు మానుకోవడం మంచిది.

అదే విధంగా కూరగాయలతో జ్యూస్ తయారు చేసేటప్పుడు దానిలో సాల్ట్ కానీ ఇతర స్పైసెస్ కానీ వేయకుండా ఉండడం మంచిది.

ఎప్పుడైనా జ్యూస్ చేసుకునేటప్పుడు పండ్లు లేదా కూరగాయల గింజలు ఉంటే వాటిని తొలగించడం మంచిది. గింజలు ఉండడం వల్ల రుచి పాడవుతుంది. అలానే కొన్ని కూరగాయల గింజలు వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news