అప్ఘానిస్తాన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. అప్ఘానిస్తాన్ తాలిబన్ల వశమైన నాటి నుంచి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. అక్కడ హింస కూడా విపరీతంగా పెరిగిపోతోంది. అంతర్జాతీయ వాణిజ్యం నిలిచిపోయింది. ప్రజలు తాలిబన్ల బాధలు పడలేక ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. అయితే… తాజాగా అఫ్ఘానిస్థాన్ పరిస్తితులు ఆశాజనకంగా లేక పోవడంతో నిశ్చితార్థం రద్దు చేసుకుంది బిగ్ బాస్ సీజన్ 11, 14 కంటెస్టెంట్ అర్షి ఖాన్.
ఈ ఏడాది అక్టోబర్ లో అప్ఘానిస్తాన్ క్రికెటర్ తో ఈమె కు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. కానీ అప్ఘానిస్తాన్ దేశ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. ఆమె కుటుంబ సభ్యులు దీనిని రద్దు చేసేశారు. ఈ విషయాన్ని ఈ బ్యూటీ అర్షి ఖాన్ తెలిపారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. పెళ్లి ఆగిపోయినట్లే అని తెలిపింది. అప్ఘానిస్తాన్ క్రికెటర్ తో తన నిశ్చితార్థం జరగాల్స ఉండగా.. కానీ తాలిబన్లు.. అప్ఘానిస్తాన్ ను ఆక్రమించడంతో అది కాస్త రద్దయిందని పేర్కొంది.