సహనం కోల్పోతున్నారా..? అయితే ఆ సమయంలో ఇలా చేస్తే మంచిది..!

నిజంగా సహనం చాలా ముఖ్యం. ఏదైనా సందర్భం వస్తే సహనంగా దాన్ని డీల్ చేస్తూ ఉంటే సమస్య సాల్వ్ అయిపోతుంది. సహనం కోల్పోతే కష్ట సమయంలో మరింత కష్టమైపోతుంది. సహనం తో మీరు ఉండాలంటే కచ్చితంగా వీటిని పాటించండి. దీనితో మీకు కష్ట సమయం వచ్చినా సహనంతో ఉంటారు. మరి దాని కోసం ఏ ఆలస్యం లేకుండా చూసేయండి.

 

losing patience
losing patience

సహనంతో కష్ట సమయంలో ఉండాలంటే ఈ విధంగా చేయండి:

చాలా మంది ఏమైనా కష్టాలు వస్తే ఆ కష్టాలుని పక్కన పెట్టేసి వెళ్ళి పోతూ ఉంటారు. కానీ అలా చేయడం మంచిది కాదు. వాటి నుండి ఎలా బయట పడాలి అని మీరు ఆలోచించాలి. మీ మైండ్ కి మీరు ఎలా సాల్వ్ చేయాలి, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది తెలియజేయండి.

ఒకసారి కనుక మీరు ఆ సమస్యని ఎదుర్కొంటే మరోసారి ఆ సమస్య రాదు. ఒకవేళ కనుక మీరు ఆ సమస్యని పరిష్కరించ లేక పోతే మీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా సమస్యను పరిష్కరించమని అడగండి.

అదే విధంగా ఏవైనా సమస్యలు కలిగినప్పుడు ఆ ఇబ్బందుల్లో కూరుకుపోకుండా కాస్త తెలివిగా ఆలోచించండి.

అలానే ఇటువంటి సమయంలో మోటివేషన్ చాలా ముఖ్యం. సహనాన్ని కోల్పోకండి. మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో ఎదుర్కొన్న కష్ట సమయాల గురించి తలుచుకుని.. మీరు అందుకున్న విషయాలను తెలుసుకోవడం లాంటివి చేయడం వల్ల మీరు మీ సహనాన్ని కోల్పోకుండా సాధించడానికి వీలవుతుంది. కాబట్టి వీటిని ప్రయత్నం చేసి చూడండి.