అమెరికా: జులై 25 తాజ్ మహల్ కు మూడు రెట్లు ఉండే ఒక ఉల్క భూమి చాలా దగ్గరగా ప్రయాణించనుంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా నానా వెల్లడించింది. ఈ ఉల్క భారత కాలమానం ప్రకారం జులై 25 భారత కాల మాన ప్రకారం తెల్లవారు జామున మూడు గంటలకు భూమి ప్రయాణించనుందని స్పష్టం చేసింది. ఈ ఉల్క భూమికి 4.7 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోతుంది. ఈ దూరం భూమి.
చంద్రుడి మధ్య దూరానికి 12 రెట్లు. అయితే నాసా లెక్కల ప్రకారం సౌర కుటుంబానికి 190 మిలియన్ కిలో మీటర్ల దూరంలోకి ఏ వస్తువు వచ్చినా అది భూమికి దగ్గరగా వచ్చినట్లే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రమాదకరమైన ఉల్కల నుంచి భూమిని రక్షించేందుకు డార్ట్ మిషన్‌ను నాసా సిద్ధంచేసింది. ఈ మిషన్‌ను ఉపయోగించి భూమిని చేరకుండా ఉల్కను దారి మళ్లిస్తారు.
అదృష్టవశాత్తూ, ప్రమాదకరమైన గ్రహశకలాలు దారి మళ్లించగల ఒక గ్రహ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. నవంబరులో, నాసా డబుల్ ఆస్టరాయిడ్ రీడైరక్షన్ టెస్ట్ (DART) మిషన్‌లో ఒక అంతరిక్ష నౌకను పంపడానికి సిద్దమైంది, ఇది సెకనుకు 6.6 కిలోమీటర్ల వేగంతో 780 మీటర్ల పరిమాణంలో ఉన్న ఆస్టరాయిడ్ డిడిమోస్ మూన్‌లెట్‌పై క్రాష్ అవుతుంది.
ఆ సమయంలో సంభవించే విస్ఫోటనం కారణంగా జనించే శక్తి గ్రహశకలం దిశ, గమనాల్ని మార్చి భూమికి దూరంగా పంపిస్తుంది.