పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి…!

-

మహిళల పీరియడ్స్ సమయం లో కడుపు నొప్పి తో బాధ పడతారు. అటువంటి సమయం లో పెయిన్ కిల్లర్స్ వాడటం కంటే ఇంటి చిట్కాలు పాటించడం మేలు. ఈ విధంగా వీటిని కనుక మీరు ప్రయత్నం చేసి చూస్తే మీకు వెంటనే ఫలితం కనబడుతుంది. పైగా పూర్తిగా నొప్పి కూడా తగ్గిపోతుంది. ఎండు ద్రాక్ష మరియు కుంకుమ పువ్వు తో ఈ సమస్య పరిష్కారం కనబడుతుంది.

 

దీని కోసం మీరు 4 నుండి 5 ఎండుద్రాక్ష తీసుకుని ఒక బౌల్లో వేసి నీళ్లు పోయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం ఆ నీటిని తాగండి. అదే విధంగా ఒక దాంట్లో రెండు లేదా 1 కుంకుమ పువ్వు రేఖల్ని వేయండి. దానిలో నీళ్ళు పోసి రాత్రంతా వదిలేసి ఉదయానికల్లా తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు క్రామ్ప్స్ తగ్గిపోతాయి.

అదే విధంగా కడుపు నొప్పి ఉండదు. ఐరన్ లోపంకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. కాన్స్టిట్యూషన్ సమస్యలు కూడా తగ్గిస్తుంది. హాట్ వాటర్ లేదా హీటింగ్ ప్యాడ్ కూడా మంచి ఉపశమనం ఇస్తుంది. హాట్ వాటర్ బ్యాగ్ తీసుకుని దానిలో వేడినీళ్లని వేయండి. లేదంటే మీరు గాజు సీసాని కూడా వాడొచ్చు.

మీ కడుపు మీద ఆ బాటిల్ ని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచండి నిజంగా ఇది ఔషధంలా పని చేస్తుంది. అదే విధంగా మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. మామూలు రోజుల్లో పోషకాహారం తప్పక తీసుకోవాలి. అరటి పళ్లు, ఆకుకూరలు, విటమిన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా తీసుకుంటూ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news