బరువు తగ్గడానికో, ఇమ్యునిటీ పవర్ పెరగడానికో మొత్తానికి చాలామందికి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకోని తాగటం అలవాటుగా ఉంటుంది. ఇది టేస్టుకూడా ఏమంత బాగుండదు. కానీ తప్పక తప్పనిపరిస్థితుల్లో తాగుతారు. ఇలా ఖాళీ కడుపుతో తాగటం వల్ల బరువు తగ్గుతారని వారి నమ్మకం. ఒక్క బరువే కాదు..శరీరంలో వివిధ ఆరోగ్య సమస్యలు తగ్గించి శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఇలా నిమ్మరసం తాగటం వల్ల ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి..కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా..అవేంటో ఈరోజు చూద్దాం.
నిమ్మరసం ఎక్కువగా తాగటం వల్లే కలిగే నష్టాలు:
నిమ్మకాయలో ఉండే యాసిడ్ వలన దంతక్షయం ఏర్పడుతుంది.
రోజూ నిమ్మరసం తాగడం వలన దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది.
నిమ్మకాయలో విటమిన్ సి ఉండడం వలన ఐరన్ శోషణ పెంచుతుంది.
నిమ్మరసంను ఎక్కువగా తాగడం వలన గుండెల్లో మంట.. వికారం వస్తుంది.
నిమ్మరసంను రోజూ తాగడం వలన కడుపు నొప్పి కలుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువవుతాయి.
నిమ్మకాయలో ఉండే యాసిడ్ ఎముకలకు హాని కల్గిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యకు కూడా కారణమవుతుంది.
ఆస్కార్బిక్ యాసిడ్ లేదా విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీంతో తరచూ మూత్రవిసర్జన సమస్య ఎదుర్కోవలసి వస్తుంది.
ఎక్కువ మోతాదులో విటమిన్ సి ఉండడం వలన శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది.
నిమ్మరసంలో ఉంటే సిట్రిక్ యాసిడ్ నోటి పూతలను మరింత తీవ్రం చేస్తుంది. అలాగే చిగుళ్ల సమస్యలను కల్గిస్తుంది.
నిమ్మరసం లాంటి పదార్థాలు మైగ్రేన్ లాంటి నొప్పికి కారణం అవుతాయి. పుల్లగా ఉండే నిమ్మరసం అధికంగా తాగితే తరచుగా మైగ్రేన్ సమస్య బారిన పడతారు. కనుక నిమ్మరసం సాధ్యమైనంత తక్కువగా సేవించాలి.
నిమ్మరసం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..పరిమితికి మించి తాగితే నష్టం ఉంది కదా..24 గంటల వ్యవధిలో కేవలం 2 లేదా అంతకు తక్కువే తినాలి. రెండు కన్నా ఎక్కువ నిమ్మకాయల రసాన్ని కూడా తాగకూడదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పంటికి తగలకుండా స్ట్రా ద్వారా తాగితే సమస్య కాస్త తగ్దుతుంది.
బ్రష్ చేయకుండా..నిమ్మరసం తీసుకోకూడదు. రెండు మూడు సార్లు నోటిని నీటితో పుక్కిలించాలి. ఆ తర్వాతే నీటిని తాగాలి. లేకపోతే నోటిలోని బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని వల్ల మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బాటిల్ లో ఉండే నిమ్మరసం కూడా ఏమాత్రం మంచిది కాదు. ఇంట్లో సహజంగా తయారుచేసిన నిమ్మరసమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
-Triveni Buskarowthu