ఘాటుగా ఉండే మిర్చిని వంటకాలలో తినటానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది కారం తినడానికి మక్కువ చూపారు. ఎందుకంటే కారం ఎక్కువగా తినడం వలన బీపీ అల్సర్ వచ్చే అవకాశం ఉందని తినటం మనేస్తు ఉంటారు. అయితే కొంతమంది ఇవి ఏమీ పట్టించుకోకుండా తింటూ ఉంటారు. కారం ఎక్కువ తింటే ప్రమాదం జరుగుతుందని భావించే వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇటీవల జరిగిన ఒక అధ్యయనం.
అయితే మిరపకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. మిర్చిని వంటల్లో చేర్చుకునే వారిలో ఈ వ్యాధుల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు దాదాపు పావువంతు తగ్గుతాయని పరిశోధకులు తేల్చారు. ఇక మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ మనల్ని వ్యాధులకు దూరంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాప్సైసిన్ మిరపకాయల్లో కారం వంటి రుచిని ఇచ్చే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయులను అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్‌కు కారణమయ్యే కణితులు, ఛాతీలో మంట వంటి అనారోగ్యాలను నిరోధించడానికి దోహదపడుతుంది.
తాజాగా ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌కు చెందిన డాక్టర్ బో జు అనే పరిశోధకుడి నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. మిర్చి ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ మరణాల ప్రమాదాన్ని తగ్గించవచ్చని బోజు వెల్లడించారు. ఈ అధ్యయనం కోసం అవసరమైన సమాచారాన్ని చైనా, ఇరాన్, ఇటలీ, అమెరికా దేశాల్లో గతంలో నిర్వహించిన అధ్యయనాల నుంచి సేకరించారు.
అంతేకాదు ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన ఆహారం ప్రాముఖ్యతను తాజా పనిశోధన గుర్తుచేస్తుందని డాక్టర్ బోజు తెలిపారు. ఈ ఫలితాలను ఆహారం, ఆరోగ్యం పరంగానే చూడాలని ఆయన చెప్పారు. మిరపకాయలు తినడం వల్ల ఎక్కువ కాలం జీవించగలుగుతారని ఆయన అన్నారు. ఇక వ్యాధుల వల్ల చనిపోయే వారి సంఖ్య తగ్గుంతుందని ఎవరూ భావించవద్దని ఆయన సూచిస్తున్నారు.