రోజుకు ఒక మనిషికి వచ్చే ఆలోచనలు ఎన్ని వేలు ఉంటాయో తెలుసా..?

కొత్త విషయాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటాయి. నిజానికి ఇవి కొత్తవి కావు.. మనకు తెలియని అంతే. పోర్న్ వీడియోస్ చూసే అలవాటు ఈరోజుల్లో చాలామందికి ఉంటుంది.. కానీ మీకు తెలుసా.. రోజుకు ఎన్ని వీడియోస్ ఉత్పత్తి అవుతాయో.. పొద్దున లేచిన దగ్గర నుంచి.. మనలో మనం ఎన్ని వేల ఆలోచనలు చేస్తామో ఎప్పుడైనా గమనించారా..? రెండు వారాలపాటు కంటిమీద కునుకు లేకుండా ఉంటే.. ఏమవుతుందో తెలుసా..? ఇలాంటి మరికొన్ని విశేషాలు ఈరోజు మీ కోసం..!

గుడ్లలో సిస్టెయిన్ (cysteine) అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది హ్యాంగోవర్ తగ్గేందుకు సహాయపడుతుంది. ఈసారి హ్యాంగోవర్ వచ్చినప్పుడు ట్రై చేయండి మరీ..!

ప్రపంచంలో ప్రతి 30 నుంచి 50 నిమిషాలకు ఓసారి 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చి చదివేవారు భారీ సక్సెస్ సాధిస్తున్నారు. అదేపనిగా చదివితే.. ఎక్కువ స్ట్రస్ ఫీల్ అవుతారండోయ్..!

కంటిన్యూగా 2 వారాలు మెలకువగానే ఉంటే… చనిపోయే అవకాశాలు ఎక్కువట.

టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే సినిమా‌లో ద్రవరూప లోహ ఎఫెక్టుల (liquid metal effects) కోసం ఫొటోషాప్‌ (Photoshop)ని కనిపెట్టారు. నేడు ఇది బీభత్సంగా వాడే ఎడిటింగ్ యాప్ లో ఒకటైంది.

గబ్బిలాలు నడవగలవు. కానీ నడిస్తే వాటి కాళ్లు విరిగిపోతాయట.. అంత వీక్ గా ఉంటాయి వాటి కాళ్లు.

గుహలోంచీ బయటకు వచ్చాక గబ్బిలాలు ఎప్పుడూ ఎడమవైపే వెళ్తాయి.

థాయ్‌లాండ్ ప్రజలు చాటింగ్‌లో హహహ బదులు 555 అని టైప్ చేస్తారు. ఎందుకంటే 5 అంటే థాయ్ భాషలో హ అని అర్థం.

కుడి చేతి వాటం వారి కంటే ఎడమచేతి వాటం వారు ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయగలరట.

ఎడమ చేతి వాటం వారి కంటే కుడి చేతి వాటం వారు సగటున 9 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తున్నారు

అందమైన పెయింటింగ్స్ చూడటం ద్వారా శారీరక నొప్పి తగ్గుతుంది.

అమెరికాలో ప్రతి 5 సెకండ్లకూ 60వేల ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నారట.

భయపడుతున్నట్లుగా, ఆందోళనగా ఉన్నట్లు కనిపించేవారు… అవకాశం వస్తే మోసం చేస్తారు. వీళ్లతో జాగ్రత్తండోయ్.

అల్పాకా ఒకటే ఉంటే చనిపోతుంది. వాటిని ఎప్పుడు కొన్నా జంటగానే కొనాలి.

పసికందులకు పుట్టిన కొన్నేళ్లవరకూ కలలు రావు.

ఏడేళ్లు కొనసాగిన స్నేహం… జీవితాంతం కొనసాగే అవకాశం ఉంటుందట.. ఈ విషయం మనకూ తెలుసు కదా..!

ప్రతి వ్యక్తికీ యావరేజ్‌గా రోజుకు 3వేల ఆలోచనలు వస్తాయి.. మీకు ఎన్ని వస్తాయో ఈసారి గమనించండి.

ప్రతి ఒక్కరి ప్లే లిస్టులో వినాలనుకోని సాంగ్ ఒకటి ఉంటుంది. దాన్ని ప్రతిసారీ స్కిప్ చేస్తారే తప్ప డిలీట్ చెయ్యలేరు.

ముసలివారికి ఉదయం వేళ మెమరీ పవర్ బాగా ఉండి… మధ్యాహ్నానికి తగ్గుతుందట.

ప్రతి 39 నిమిషాలకూ ఓ కొత్త పోర్న్ వీడియో ఉత్పత్తి అవుతోంది.

-Triveni Buskarowthu