షుగర్ తగ్గాలంటే మామిడి ఆకులు ఎలా వాడాలో తెలుసా..?

-

ఇక ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. ఈ మామిడి కాయలతో ఆవకాయ పెట్టుకోవచ్చు, చెట్నీ చేసుకోవచ్చు, పండ్లని నేరుగా తినేయచ్చు.ఈ సీజన్ కాకుండా మళ్ళీ మళ్లీ మామిడి పండ్లు దొరకవని ప్రజలు కూడా వీటిని ఎక్కువగా లాగించేస్తున్నారు. ఇక ఈ పండులో విటమిన్ సి, పీచు పదార్థము ఉండడం వల్ల జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపుకు ఎంతో మేలు చేస్తాయి. ఈ విషయం దాదాపుగా అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కానీ వీటి ఆకులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం మాత్రం ఎక్కువగా ఎవరికీ తెలియకపోవచ్చు.అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కానీ ఈ మామిడి ఆకుల్లో కూడా ఎన్నో ఔషద గుణాలుంటాయి. ఇక మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ ఎ, విటమిన్ బి ఇంకా అలాగే విటమిన్ సి అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎన్నో వ్యాధులను కూడా ఈజీగా నయం చేస్తాయి. షుగర్ ఉన్నవాళ్లకు మామిడి ఆకులు మంచి ఔషదంతో సమానం అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఆకుల్లో ఉండే ఆంథోసైనిడిన్స్ అనే టానిన్లు డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇందుకోసం మామిడి ఆకులను బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకుని తీసుకుంటే ఖచ్చితంగా షుగర్ వున్న వాళ్లకు తగ్గిపోతుంది. ఎలాగంటే ఒక గిన్నెను తీసుకుని అందులో నీళ్లు పోసి కొన్ని మామిడి ఆకులను వేసి బాగా మరిగించి.. వాటిని పక్కకు పెట్టుకోవాలి. వాటర్ ను రాత్రంతా కూడా అలాగే ఉంచి.. ఉదయం పూట వడగట్టి పరగడుపున తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

మామిడి ఆకులు కిడ్నీల్లో ఉండే రాళ్లను తొలగించడానికి కూడా ఈజీగా సహాయపడతాయి. ఇక ఇందుకోసం..మామిడి ఆకుల పౌడర్ ను టీ స్పూన్ తీసుకుని వాటిని ఓ గ్లాస్ నీటిలో వేయాలి. దీన్ని రాత్రంతా కూడా అలాగే ఉంచి.. పొద్దున పూట పరగడుపున తాగాలి. తరచుగా ఇలా చేస్తే ఈజీగా రాళ్లు తొలగిపోతాయి. ఇంకా బీపీని తగ్గించడంలో కూడా మామిడి ఆకులు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.. ఇందుకోసం ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో మామిడి ఆకులను వేసి బాగా మరగబెట్టి వాటిని కషాయంగా తాగాలి. ఇది రక్తపిడనాన్ని తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news