కూల్‌ డ్రింక్స్‌ తాగిన గంట లోపల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

-

ఏ సీజన్‌లో అయినా కూల్‌డ్రింక్స్‌కు మంచి డిమాండ్‌ ఉంటుంది. పైగా ఈ వేసవిలో అయితే మరీను. తెగ తాగేస్తుంటారు. వద్దురా ఆరోగ్యాలు పాడవుతాయని ఎంతమంది చెప్పినా మనం వినం. అదేంటో ఏదైనా మసాల వంట తిన్నప్పుడు కూల్‌ డ్రింక్స్‌ తాగితే వచ్చే కిక్కే వేరు. కూల్ డ్రింక్స్‌లో కార్బోనేటెడ్ వాట‌ర్, పంచ‌దార‌, ర‌సాయ‌నాలు, హాని క‌లిగించే యాసిడ్లు, వివిధ రంగుల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. వీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌డంతో పాటు పొట్ట‌లో యాసిడ్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీంతో మ‌న శ‌రీరం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతుంది. ఈ విషయం మనకు తెలుసు. అసలు కూల్ డ్రింక్స్‌ను తాగిన గంట‌ లోప‌ల మ‌న శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

కూల్ డ్రింక్ ను తాగ‌డం అంటే నేరుగా పంచ‌దార‌ను తిన‌డ‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు. 350 ఎమ్ ఎల్ కూల్ డ్రింక్‌లో 35 నుంచి 45 గ్రాముల పంచ‌దార ఉంటుంది. వీటిని తాగిన వెంట‌నే శ‌రీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కొద్ది మొత్తంలో తీపి ప‌దార్థాల‌ను తింటేనే క‌డుపు నిండిన‌ట్టు ఉంటుంది. కానీ కూల్ డ్రింక్‌ల‌ను తాగిన కూడా క‌డుపు నిండిన‌ట్టు ఉండ‌దు. దీనికి కార‌ణం వాటిల్లో ఫాస్పారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కూల్ డ్రింక్స్‌లో ఉండే షుగ‌ర్ స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. కూల్ డ్రింక్స్‌ను తాగడం వ‌ల్ల వీటిలో ఉండే షుగ‌ర్ శ‌రీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతుంది.

అలాగే కూల్ డ్రింక్స్ లో కెఫిన్ ఉంటుంది. వీటిని తాగిన 40 నిమిషాల త‌రువాత ఈ కెఫిన్‌ను శ‌రీరం పూర్తిగా గ్ర‌హిస్తుంది. దీంతో నిద్ర‌లేమి స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే ర‌క్త‌పోటు స‌మ‌స్య కూడా వస్తుంది. కూల్ డ్రింక్స్‌ను తాగిన 50 నిమిషాల త‌రువాత మెద‌డులో సంతోషాన్ని క‌లిగించే హార్మోన్ ఎక్కువ‌గా విడుద‌ల అవుతుంది. దీంతో మ‌న‌కు ఎక్కువ‌గా హ్యాపీగా ఉంటుంది. ఇది డ్ర‌గ్స్ తీసుకోవ‌డం, ధూమ‌పానం చేయ‌డం, ఆల్కాహాల్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దీంతో మ‌న మెద‌డు ప‌దేప‌దే కూల్ డ్రింక్ తాగ‌మ‌ని ప్రోత్స‌హిస్తుంది.

కూల్ డ్రింక్ తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎక్కువ‌గా మూత్ర‌విస‌ర్జ‌నకు వెళ్లాల్సి వ‌స్తుంది. దీంతో శ‌రీరం డీ హైడ్రేష‌న్ బారిన ప‌డుతుంది. అలాగే శ‌రీరం దానిలో ఉండే పోష‌కాల‌ను కోల్పోతుంది. దీంతో కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

పోష‌కాల‌ను కోల్పోవ‌డం వ‌ల్ల కూల్ డ్రింక్స్ తాగిన గంట త‌రువాత శ‌రీరం అలిసి పోయిన‌ట్టుగా ఉంటుంది. కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎటువంటి మేలూ ఉండదు. పైగా దంతాలు, ఎముక‌లు గుళ్ల బారిపోతాయి. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ల బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. డ‌యాబెటిస్, ఎసిడిటీ, అల్స‌ర్ వంటి స‌మ‌స్యలన్నీ వస్తాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువ‌గా తాగే వారిలో ఫ్యాటీ లివ‌ర్, హార్ట్ ఎటాక్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. సో.. ఇందుమూలంగా మీ అందరికీ చెప్పేదేంటంటే.. పోయి పోయి ప్రాణాలను ఎందుకు రిస్క్‌లో పెట్టడం.. అస్సలు ఒక్కొక్కరి ఇంట్లో ఈ సమ్మర్‌లో కేసులు కేసులు కూల్‌ డ్రింక్స్‌ బాటిళ్లు ఉంటాయి. విషాన్ని ఎంత తియ్యగా తీసుకుంటున్నారో.. ఆ డబ్బు పెట్టి పండ్ల రసాలు తాగితే ఎంత మంచిది..! మారండి.. మీతో పాటు మీ వాళ్లను కూడా మార్చండి.!

Read more RELATED
Recommended to you

Latest news