రోజూ ఫ్రైడ్ చికెన్ లాగిస్తున్నారా? రోజూ చికెన్ బకెట్ ఖాళీ చేయాల్సిందేనా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే.. ఫ్రైడ్ చికెన్ తో ప్రాణాలకే ముప్పంటున్నారు వైద్యులు. తాజా అధ్యయనంలో ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టారు పరిశోధకులు. దానికి సంబంధించిన వివరాలను బ్రిటీష్ జర్నల్ లో ప్రచురించారు.
ఫ్రైడ్ చికెన్ ఎక్కువగా తినే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఫ్రైడ్ చికెన్ తినేవారికి టైప్ 2 డయాబెటిస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు.. ఫ్రైడ్ చికెన్ ఎక్కువగా తినేవారిలో క్యాన్సర్ లక్షణాలనూ గుర్తించారు పరిశోధకులు. ఒక్క ఫ్రైడ్ చికెనే కాదు.. ఫ్రై చేసిన ఏ వస్తువులు తిన్నా అంతే. ఫ్రైడ్ ఫిష్, ఫ్రైడ్ మటన్, ఫ్రైడ్ చికెన్, మిగితా ఫ్రైడ్ ఐటెమ్స్ ఏది తిన్నా కూడా, యుక్త వయసులో ఉన్నవారికైనా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు కానీ.. నిత్యం ఇలా ఫ్రై చేసిన నాన్ వెజ్ తింటే అంతే సంగతులు.