దాల్చిన చెక్క పాలతో మధుమేహం మాట వింటుందా..?

-

మసాల దినుసులకు మన దేశం పెట్టింది పేరు. అలాగే రోగాలకు కూడా పుట్టిల్లు లాంటిందే.. ఎక్కడ సంపద ఎక్కువ ఉంటుందో అక్కడ రోగాలు ఎక్కువగా ఉంటాయి అనే నానుడిని ఇండియా నిజం చేస్తుంది. భారత్‌లో డయబెటిక్‌ పేషెంట్లు ఎక్కువ. ప్రతి పది మందిలో ఆరుగురికి మధుమేహం ఉంటుంది. వీటి నుంచి బయటపడేందుకు ఎన్నో తిప్పలు పుడుతుంటారు. కంట్రోల్‌ ఉంచేందుకు ఎన్ని కంచెలు వేసినా పరిస్థితి ఏం మారడం లేదు. ఇంగ్లీష్‌ మందులు, ఆయుర్వేదం, ఔషధం ఎవరికి నచ్చింది వారు వాడేస్తున్నారు. అయితే దాల్చిన చెక్క గురించి అందరికీ తెలుసు. ఇది మధుమేహంను కంట్రోల్లో ఉంచుంతుందని కూడా ఇప్పటికే అధ్యయనాలు నిరూపించాయి.. అయితే దాల్చిన చెక్క పొడిని పాలల్లో వేసుకుని తాగడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయట.!!

శరీరంలో ఇన్సులిన్ లోపం వల్ల మధుమేహం సమస్య వస్తుంది. ఇన్సులిన్ శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.. కానీ తక్కువ చేస్తుంది. ఇన్సులిన్ అనేది జీర్ణ గ్రంధి ద్వారా ఉత్పత్తి చేయబడే ఓ హార్మోన్. ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తి రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటే.. ముందుగా ఆహారంపై కంట్రోల్ ఉండాలి. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్‌ని తీసుకోవాలి.

మన వంటగదిలో ఉండే మసాలా దినుసులు రక్తంలో చక్కెరను వేగంగా నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయని రుజువు అయ్యింది. చక్కెరను నియంత్రించడానికి, పాలతో దాల్చిన చెక్కను తీసుకోండి. దాల్చిన చెక్క చక్కెరను వేగంగా నియంత్రించే మసాలా అని నిపుణులు అంటున్నారు. దాల్చిన చెక్క, పాలు తీసుకోవడం వల్ల చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు..

దాల్చిన చెక్క చక్కెరను ఎలా నియంత్రిస్తుంది..?

దాల్చినచెక్కలో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, బీటా కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్, లైకోపీన్, విటమిన్లు ఈ మసాలాలో సమృద్ధిగా ఉన్నాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్లలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులు దాల్చిన చెక్కను పాలతో కలిపి తీసుకుంటే సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయి రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.

దాల్చిన చెక్క పాలను ఎలా తయారు చేయాలంటే..

ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు పాలు వేసి రెండు చెంచాల దాల్చిన చెక్క పొడిని వేసి కొంత సేపు మరిగించాలి. పాలు 5-7 నిముషాలు బాగా మరిగిన తర్వాత వడకట్టి తాగాలి. ఈ పాలలో చక్కెర వేయకూడదు. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news