ఎండుద్రాక్ష, బెల్లం కలిపి తింటే..బరువు ఈజీగా తగ్గేయొచ్చట..!

-

బరువు తగ్గాలని చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామం చేసి కష్టాపడేంత సమయం ఉండదు. పోనీ పొట్టమాడ్చుకుని ఉందామంటే.. మనసు ఆగదు. ఇలా తెలియని ఒక మానసిక ఆందోళనతో సతమతమవుతుంటారు. బరువు తగ్గాలంటే.. కష్టమైన వ్యాయాములు, కఠినమైన డైట్ లే చేయక్కర్లేదు.. కొన్ని చిన్న చిన్న టిప్స్ ద్వారా.. హెల్తీగా బరువు తగ్గేయొచ్చు. ఎండు ద్రాక్ష.. రెండోది బెల్లం.. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే.. బరువు ఈజీగా తగ్గొచ్చట. కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. ఫలితంగా అతికొద్ది రోజుల్లోనే బరువు తగ్గిపోతారు. ఇంతకీ ఈ రెండింటిని కలిపి ఎలా తీసుకోవాలి? ఏంటో చూద్దామా..!

గోరు వెచ్చని నీటిని తీసుకోండి. అందులో 4 నుంచి 5 వరకు ఎండుద్రాక్షలను వేసి రాత్రి సమయంలో నానబెట్టుకోవాలి. ఉదయం లేచిన తర్వాత పరగడుపున కొంత బెల్లం తీసుకోవాలి. ఇక ఎండు ద్రాక్ష నానబెట్టిన నీళ్లను ఒక గ్లాసులో తీసుకోవాలి. ఇప్పుడా నీటికి కొంత బెల్లం కలపాలి. ప్రతిరోజూ ఇలా చేయడం ద్వారా మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా కేలరీలు కరిగిపోతాయి. బరువు కూడా వెంటనే తగ్గిపోతారు.

బ్రడ్ ప్రెజర్ సమస్యను వెంటనే తగ్గించగలవు. అంతేకాదు.. ఊపిరితిత్తులను కూడా శుభ్రం చేయగలవు. ఇంకా ఇవి ఎముకలను బలోపేతం చేయగలవు. జీవక్రియను కూడా మెరుగుపర్చగలవు. మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, సెలీనియం, మాంగనీస్, ఐరన్, జింక్ వంటి ఎన్నో పోషక విలువలు లభిస్తాయి. షుగర్ పేషెంట్స్ వైద్యుల సలహా మేరకే బెల్లం వాడగలరు.

ఇలా డైలీ చేయడం వల్ల హెల్తీగా బరువు తగ్గొచ్చు. బరువు తగ్గడం అంటే కష్టపడాల్సిందే అనుకోవడం పొరపాటే.. తినే తిండి మీద కంట్రోల్ ఉంచి.. కాలరీలు తక్కువ ఉన్నవి తీసుకుంటే ఈజీగా తగ్గొచ్చు. చాలామంది కఠినమైన డైట్ ఫాలో అయి బరువు తగ్గుతారు.. కానీ వారికి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంకా వెన్నునొప్పు సమస్య కూడా వస్తుంది.

కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోయినట్లు.. బరువు తగ్గే ప్రయత్నంలో అనేక రోగాలు ఎందుకు కొని తెచ్చుకోవడం చెప్పండి. కాబట్టి.. ముందు మీ ఆలోచన మార్చుకుని.. ఆ తర్వాత జీవనశైలిలో కొద్ది కొద్దిగా మార్పులు చేస్తే చాలు.. ఒకే రోజు కాకపోవచ్చు.. కానీ ఒక రోజు మాత్రం కచ్చితంగా మీరు అనుకున్నది అయి తీరుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news