చ‌ర్మ సౌంద‌ర్యం పెర‌గాలంటే.. ఈ ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి..!

-

చూడ‌చ‌క్క‌ని, మృదువైన‌, మెరిసే చ‌ర్మం ఉండాల‌నే చాలా మంది కోరుకుంటారు. కానీ కొంద‌రికి ఈ త‌ర‌హా చ‌ర్మం పుట్టుక‌తోనే వ‌స్తుంది. కానీ కొంద‌రికి మాత్రం ఇలా ఉండ‌దు. ఏదో ఒక చ‌ర్మ స‌మస్య ఉంటుంది. దీంతో వారు త‌మ చ‌ర్మాన్ని కాంతివంతంగా మార్చుకునేందుకు ర‌క ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే అలాంటి వారు కింద సూచించిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే చాలు.. దాంతో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను పోగొట్టుకోవ‌చ్చు. అలాగే చ‌ర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. మరి అందుకు నిత్యం తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. మెగ్నిషియం

మ‌న శ‌రీరంలో ఉండే లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేసేందుకు మెగ్నిషియం ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటేనే చ‌ర్మం కూడా ఆరోగ్యంగా క‌నిపిస్తుంది. కనుక లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచే ఆహారం కూడా తినాలి. అందుకు గాను మెగ్నిషియం ఎక్కువ‌గా ఉండే డార్క్ చాకొలెట్లు, ఫిగ్ పండ్లు, అర‌టి పండ్లు, విత్త‌నాలు, అవకాడో త‌దిత‌రాల‌ను నిత్యం తీసుకుంటే త‌ద్వారా లివ‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. దీంతో చ‌ర్మం కూడా సుర‌క్షితంగా, కాంతివంతంగా మారుతుంది.

2. ఫ్యాటీ యాసిడ్లు

ఫ్యాటీ యాసిడ్లు కూడా మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. క‌నుక ఇవి ఎక్కువ‌గా ఉండే ఆలివ్ ఆయిల్‌, అవిసె విత్త‌నాలు, బాదంప‌ప్పు, తృణ ధాన్యాలు ఎక్కువ‌గా తింటే ఫ్యాటీ యాసిడ్లు ల‌భించి త‌ద్వారా చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మ సౌంద‌ర్యం పెరుగుతుంది.

3. ఆల్క‌లైన్

తాజా కూర‌గాయ‌లు, పండ్లు, తృణ ధాన్యాలు, న‌ట్స్ శ‌రీరంలో ఆల్క‌లైన్ స్వ‌భావాన్ని పెంచుతాయి. దీని వ‌ల్ల చ‌ర్మం సంర‌క్షింప‌బ‌డుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version