తిరుమలలో చిరుతల సంచారం కలకలం రేపింది. తాజాగా ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో చిరుత బోనులో చిక్కింది. మూడు రోజులు క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమీపంలోనే చిరుత బోనులో చిక్కింది.
ఇక ఆ చిరుతను బంధించడానికి మూడు ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేశారు. మోకాలి మిట్ట, లక్ష్మినరశింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ తరుణంలోనే.. .లక్ష్మి నరశింహస్వామి ఆలయం వద్దే బోనులో చిక్కింది మరో చిరుత.
దీంతో 50 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను బంధించారు అటవీ అధికారులు. దీంతో తిరుమల శ్రీవారి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. అధికారులు ఏర్పాటు చేసిన బోనులలో చిరుత పడటంకు సంబంధించిన వీడియోను తాజాగా అధికారులు విడుదల చేశారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.
తిరుమలలో చిరుత బోన్ లో చిక్కిన దృశ్యం pic.twitter.com/74xU2Wt4IF
— Rahul (@2024YCP) August 17, 2023