ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఐదు నిముషాలు ఇలా ప్రాణాయామం చెయ్యండి..!

-

కరోనా మహమ్మారి కారణంగా చాలా మందిలో ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ప్రాణాయామం బాగా సహాయ పడుతుంది. రోజుకు కనీసం ఐదు నిమిషాల పాటు ప్రాణాయామం చేయడం మంచిది.

పూర్తిగా ఆరోగ్యంగా ఉండడానికి ఇది బాగా సహాయ పడుతుంది. అజీర్తి సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలని ఈ ప్రాణాయామం ద్వారా తొలగించుకోవచ్చు. ప్రాణాయామం చేయడం వల్ల మెటబాలిజం కూడా బాగుంటుంది.

ప్రాణాయామం ఎలా చేయాలి..?

ప్రాణాయామం కోసం ముందుగా పద్మాసనం వేసి కూర్చోవాలి.
ఇప్పుడు మీ మెడ, తల, బాడీని స్ట్రైట్ గా ఉంచండి.
కళ్ళు మూసుకుని రిలాక్స్ గా ఉండండి.
మీ నోటిని కూడా మూసేయండి.
ఇప్పుడు మెడిటేషన్ పొజిషన్ లో మీ చేతుల్ని ఉంచండి.
శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ తిరిగి వేగంగా శ్వాసని వదలండి.

భస్త్రిక ప్రాణాయామం ఎలా చేయాలి..?

దీనిని మూడు విధాలుగా చేయొచ్చు.
ముందుగా ఐదు సెకన్ల పాటు శ్వాస తీసుకుని అలాగే వదిలేయాలి.
రెండవ సారి ఐదు సెకన్లు కాకుండా 2.5 సెకన్లు ఉండి శ్వాస తీసుకుంటూ ఉండాలి.
మూడోసారి అయితే మరి కొంచెం ఎక్కువగా సేపు ప్రాణయామం చేయాలి.

ఇలా క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు చేయడం మంచిది ఇలా ప్రాణాయామం చేయడం వల్ల పిత్త మరియు కప్ప సమస్యలు కూడా పోతాయి.

అదే విధంగా ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉండవు. అలానే మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news