ఈ ఫుడ్‌తో యాసిడిటీకి చెక్‌!

-

ఈ రోజుల్లో యాసిడిటీ సా«ధారణ సమస్యగా మారింది. దీని బారిన పడి చాలా మంది బాధపడుతున్నారు. ఏ ఫుడ్‌ పడితే అది తింటే కూడా ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. కానీ, కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. దీనివల్ల మన శరీరంలోని పీహెచ్‌ లెవల్‌ బ్యాలన్స్‌ అవుతుంది. ఆ ఫుడ్‌ ఏంటో తెలుసుకుందాం.

 

  1. చల్లని పాలు
    పాలలో ఉండే రిచ్‌ కాల్షియం వల్ల యాసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. కడుపులో మంటను కూడా త్వరగా తగ్గిస్తుంది పాలు. కడుపులో ఉండే యాసిడిక్‌ వ్యర్థాలను అబ్జర్బ్‌ చేస్తుంది.
  2. వాము
    తరుచూ వచ్చే గ్యాస్‌ ట్రబుల్‌ సమస్యకు వాము మంచి ఫుడ్‌. ఇందులో ఉండే యాక్టివ్‌ ఎంజైమ్స్, బయో కెమికల్‌ థైమల్‌ యాసిడిటీకి చెక్‌ పెడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  3. యాపిల్‌సైడర్‌ వెనిగర్‌
    యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ తాగటం వల్ల శరీరంలోని పీహెచ్‌ లెవల్‌ అదుపులో ఉంటుంది. దీంతో మీ జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. 1–2 టేబుల్‌ స్పూన్ల వెనిగర్‌ను రోజూ ఒక కప్‌ నీళ్లలో వేసుకుని తీసుకోవాలి.
  4. తులసి
    దీన్నే బెసిల్‌ లీవ్స్‌ అని కూడా అంటారు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కడుపులో పేరుకుపోయిన యాసిడ్‌ వ్యర్థాలకు తక్షణ రిలీఫ్‌ని ఇస్తుంది.
    దీన్ని ఆకులను తినొచ్చు లేదా నీళ్లలో తులసి ఆకులను నానపెట్టి ఆ వాటర్‌ను తరచూ తాగుతుండాలి.
  5. సోంపు
    గుండెమంట, యాసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. కడుపునొప్పిని కూడా తగ్గించేస్తుంది. సోంపు, మిస్ట్రీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  6. నాన్‌ సిట్రస్‌ ఫుడ్‌
    అరటిపళ్లు, యాపిల్స్, వాటర్‌ మిలన్, హనీడ్యూ, క్యాంటాలోప్, మిగతా సిట్రస్‌ తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. ఫైబర్‌ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వీటి జ్యూస్‌తో శరీరంలో హైడ్రేషన్‌ను పెంచుతుంది.
  7. కొబ్బరి నీళ్లు
    కొబ్బరి నీళ్లు కూడా యాసిడిటీని తగ్గించే మంచి పానియం. దీనివల్ల పీహెచ్‌ లెవల్‌ కూడా అదుపులో ఉంటుంది. పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల యాసిడిటీ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.
  8. అల్లం
    గుండెమంట, డైజేషన్‌ ఇతర సమస్యలకు అల్లంతో అ«ధిగమించవచ్చు. మీరు తినే ఆహారంలో జింజర్‌ను ఎక్కువ శాతం వేసుకుని తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news