దేశవ్యాప్తంగా 1,70,841 మంది కోవిడ్ రోగులు వెంటిలేటర్‌పై ఉండగా, 9,02,291 మంది రోగులు ఆక్సిజన్ సపోర్ట్‌లో ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ శనివారం తెలిపారు. మహమ్మారి పరిస్థితిని చర్చించడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 25వ సమావేశంలో తన వర్చువల్ ప్రసంగంలో మంత్రి వివరాలను వెల్లడించారు. 1.34 శాతం కోవిడ్ బాధితులు ఐసీయూలో ఉన్నారని, 0.39 శాతం మంది వెంటిలేటర్లపై, 3.70 శాతం కోవిడ్ రోగులు ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నారని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఐసీయూ పడకలలో రోగుల సంఖ్య 4,88,861 ఉండగా, 1,70,841 మంది రోగులు వెంటిలేటర్లపై, 9,02,291 మంది రోగులు ఆక్సిజన్ సహాయంతో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ ఎస్ పూరి, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు, రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, హోం వ్యవహారాల సహాయక మంత్రి నిత్యానంద్ రాయ్ పాల్గొన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయక మంత్రి అశ్విని కుమార్ చౌబే, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్య) డాక్టర్ వినోద్ కె పాల్ లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కోవిడ్ బాధితులకు అవసరమైనంత మేర లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ఉత్పత్తిని పెంచామని ఈ
ఈ సందర్భంగా మంత్రి హర్ష్ వర్ధన్ పేర్కొన్నారు. దేశీయంగా ఆక్సిజన్ ఉత్పత్తి రోజుకు 9400 మెట్రిక్ టన్నులకు పెరిగిందని, ఎల్‌ఎంఓను దిగుమతి చేసుకునే చర్యలను చేపట్టామని, పీఆర్‌సీఏ ఆక్సిజన్ ప్లాంట్ల స్థాపనను పీఎం కేర్స్ ఫండ్ సహకారంతో చేపట్టామని పేర్కొన్నారు. ట్యాంకర్ల లభ్యత, వెబ్ పోర్టల్ పనితీరు, ఎల్‌ఎంఓ ట్యాంకర్ల రియల్ టైమ్ ట్రాకింగ్ కోసం మొబైల్ అప్లికేషన్ ను రూపొందించామని తెలిపారు.