పిల్లలు హైట్ అవ్వాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి..!

-

పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా.. హైట్ బాగా ఎదగాలన్న ఈ టెక్నిక్ ఫాలో అయితే మంచిది. ఈ టిప్స్ ని కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా పిల్లలు హైట్ అవ్వగలరు. సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులు బట్టి హైట్ ఎదుగుతారు. కానీ కొన్ని కొన్ని టెక్నిక్స్ ని ఫాలో అయితే కచ్చితంగా పిల్లలు హైట్ అవుతారు.

 

పిల్లల చేత ప్రతిరోజు ఉదయాన్నే వ్యాయామం చేయించడం చాలా మంచి అలవాటు. అయితే పిల్లలు ఉదయాన్నే లేవడానికి కష్టపడుతూ ఉంటారు. కానీ మీరు కొంచెం ప్రయత్నించి చూస్తే ఖచ్చితంగా వాళ్లు లేవగలుగుతారు. స్ట్రెచింగ్, జంపింగ్, రన్నింగ్ వంటివి వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తే మంచిది. సైక్లింగ్ కూడా హైట్ ఎదగడానికి మంచిది. ఉదయం సాయంత్రం కూడా సైక్లింగ్ చేయించండి.

ఆరోగ్యకరమైన డైట్:

మీరు ఇచ్చే డైట్ బట్టి కూడా పిల్లలు హైట్ ఎదుగుతారు. స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజూ పాలు ఇవ్వండి. అలానే పెరుగు, బటర్, చీజ్ మొదలైనవి కూడా వాళ్ళకి ఇవ్వండి. దీనివల్ల వాళ్లకి కాల్షియమ్ అంది ఎముకలు దృఢంగా ఉంటాయి. అదే విధంగా పుట్టగొడుగులు, చీజ్, సోయా, ఆరెంజ్ కూడా వాళ్ళకి ఇవ్వండి. గ్రీన్ వెజిటేబుల్ సూప్ కూడా పిల్లలకి బాగా సహాయం చేస్తుంది.

నిద్ర చాలా ముఖ్యం:

అదే విధంగా నిద్ర కూడా పిల్లలకు చాలా ముఖ్యం. పిల్లల్ని ప్రతిరోజూ ఎక్కువ సేపు నిద్రపోయేలా చూసుకోవాలి. నిద్రపోయేటప్పుడు పిల్లలు వదులుగా ఉన్న దుస్తులు వేయాలి. అలానే వాళ్ళు నిద్ర పోయేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కునేటట్టు చూడండి. అలాగే మంచం మరియు ఆ పరిసరాలు కూడా శుభ్రంగా కంఫర్టబుల్ గా ఉండేటట్లు చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news