చర్మకాంతికి.. కుంకుమ పువ్వు… లాభాలు !

-

కుంకుమ పువ్వు అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది గర్భిణీ స్త్రీలు. కడుపుతో ఉన్నపుడు వారు కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగడం వలన పిల్లలు మంచి రంగులో పుట్టాడతారని నమ్మకం. అంతేకాకుండా ఈ పువ్వులో అద్వితీయమైన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి.

saffron-2
saffron-2

అయితే ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ గంధం, రెండు, మూడు కుంకుమ పువ్వు రేకులు, రెండు టీ స్పూన్ల పాలను తీసుకోండి. అన్నిటిని కలిపి మిశ్రమంగా చేసి ముఖం, మెడ భాగాలలో అప్లయ్ చేయాలి. దీనిని అప్లై చేసేటప్పుడు సున్నితంగా మసాజ్ చేయాలి. ముఖంపై మాస్క్ ఆరిన తర్వాత, మీ ముఖాన్ని కడిగేయాలి. మంచి రిజల్ట్ కోసం వారంలో కనీసం రెండుసార్లు ఈ ప్యాక్ వాడండి మరి.

అయితే ఈ ఫేస్ ప్యాక్, పొడి చర్మం ఉన్నవారికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది మీకు ఏ కాలంలో అయినా మృదువైన, తేమతో కూడిన చర్మాన్ని మీ సొంతం చేస్తుంది. అంతేకాదు దీన్ని తయారు చేయడానికి, మీకు, రెండు, మూడు తంతువుల కుంకుమ పువ్వు, ఒక టేబుల్ స్పూన్ తేనె అవసరం అవుతుంది. ఒక గిన్నెలో ఈ రెండు పదార్థాలను కలపాలి. ఆపై ముఖం మీద అప్లై చేయండి. మెడకి కూడా మాస్క్ వేయండి. కొన్ని నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి.

అంతేకాదు పాలు మీ చర్మానికి తక్షణ మెరుపుని అందిస్తుంది. ఎండ, పొల్యూషన్, సరిగ్గా లేని లైఫ్ స్టైల్ కారణంగా కోల్పోయిన మీ సహజ కాంతిని తిరిగి పొందాలని అనుకుంటే ఈ ప్యాక్ మీకు దోహద పడుతుంది. చిటికెడు కుంకుమ పువ్వు కలిపిన, నాలుగు టేబుల్ స్పూన్ల పాలను తీసుకుని, కాటన్ బాల్ ఉపయోగించి ముఖం, మెడపై రాసుకోవాలి. కొన్ని నిమిషాలపాటు అలాగే ఉంచి, ప్యాక్ ఆరిన తర్వాత, సాధారణ నీటితో క్లీన్ చేసుకోండి. ఉత్తమ ఫలితాల కోసం రోజు మార్చి రోజు రాయండి. అదే విధంగా రోజు కుంకుమ పువ్వు రేకులు, కొబ్బరి నూనె, రోజ వాటర్‌ని కలిపి దానిని ముఖానికి రాయండి. దీని వల్ల పట్టులాంటి చర్మం మీ సొంతం అవుతుందని నిపుణులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news