నాగశౌర్య ప్రీ లుక్ అదిరిపోయిందిగా..?

-

యువ కథానాయకుడు నాగశౌర్య కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మంచి స్టోరీ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ.. వరుస సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు నాగశౌర్య. ఇక నాగశౌర్య కి లవర్ బాయ్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉంది. కాగా ప్రస్తుతం నాగ శౌర్య సుబ్రమణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లమూడి తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. అయితే తాజాగా యువ కథానాయకుడు నాగ శౌర్య తన కొత్త సినిమా ఫస్ట్లుక్ విడుదల తేదీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈనెల 27వ తేదీన తన సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నామని అంటూ తెలిపారు నాగ శౌర్య. అంతకు ముందుగానే అభిమానులకు చిన్న ట్రీట్ ఇచ్చారు నాగశౌర్య. ఫస్ట్ లుక్ కి ముందు ప్రీ లుక్ విడుదల చేసి అందరిలో ఆసక్తిని కలిగించారు, అయితే ఇప్పటివరకు లవర్ బాయ్ గా కనిపించిన నాగశౌర్య కండలు తిరిగిన దేహంతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ప్రీ లుక్ అభిమానుల్లో మరింత అంచనాలను పెంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news