నెయ్యి వాడక౦ అనేది ఈ రోజుల్లో కాస్త తక్కువే. మన భారతీయ సాంప్రదాయంలో నెయ్యికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఆహరంగానే కాదు ఎన్నో పవిత్ర ప్రదేశాల్లో నెయ్యి వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఇక ఆరోగ్యం విషయంలో చాలా మందికి దాని ఉపయోగాలు తెలియక వాడకుండా ఉంటారు. నెయ్యి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. శీతకాలంలో దేహాన్ని వెచ్చగా కూడా ఉంచుతుంది.
చర్మకాంతికీ, కేశ పోషణకూ నెయ్యి ఎంతో ఉపయోగకరం. జ్ఞాపకశక్తినీ, మేధస్సునూ పెంచడం ద్వారా నెయ్యి శారీరక, మానసిక శక్తిని పెంచే ఒక టానిక్‌గా ఉపకరిస్తుంది. మరిగించిన 60 మి.లీటర్ల నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు పసుపు పొడి, అరచెంచా నెయ్యి కలిపి పరగడుపున ఒకసారి, రాత్రి భోజనం తర్వాత ఒక సారి సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుందని సూచిస్తున్నారు.
30 మి.లీ. నీటిలో అరచెంచా పసుపు, ఒక టీ స్పూను నెయ్యి వేసి ఆరగిస్తే గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు. పొడి చర్మం వాళ్లు నెయ్యితో మర్దన చేసుకుంటే, ఆ పొడితనం పోవడంతో పాటు చర్మం మృదువుగానూ, కాంతివంతంగానూ మారుతుందని, అంతే కాక నెయ్యిలోని కొవ్వు కంటికి ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా రెటీనాను ఇది శక్తివంతంగా మారుస్తుందట.