గోంగూర తింటే.. ఈ సమస్యలు దూరం అవుతాయి..!

-

చాలామంది గోంగూరని ఇష్టంగా తింటారు గోంగూర వలన ఎన్నో రకాల లాభాలను మనం పొందడానికి అవుతుంది. గోంగూరని తీసుకుంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి గోంగూరలో క్యాల్షియం, ఐరన్ తో పాటుగా విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి బాడీలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి జరుగుతుంది. రక్తహీనత సమస్య నుండి గోంగూర తీసుకుని బయటపడొచ్చు. గోంగూరని తీసుకోవడం వలన నొప్పులు కూడా తగ్గిపోతాయి.

గోంగూర ఆకుల్ని తీసుకుని వాటికి కొద్దిగా ఆముదం రాయాలి ఆ ఆకుల్ని వేడి చేసి వాపు, గడ్డలు, నొప్పులు ఉన్న చోట రాస్తే వాపులు త్వరగా తగ్గిపోతాయి. గోంగూరని తినడం వలన చక్కటి ఫలితం కనబడుతుంది. గోంగూర పూలను దంచి అర కప్పు రసం చేసుకుని వడకట్టేసి దానిని అర కప్పు పాలల్లో వేసుకుని తీసుకుంటే కంటికి చాలా మంచి జరుగుతుంది.

అలానే గోంగూరని తీసుకోవడం వలన విరోచనాలు సమస్య నుండి కూడా బయటపడొచ్చు గోంగూరని తీసుకుంటే దగ్గు ఆయాసం తుమ్ములు వంటి బాధలు ఉండవు. గోంగూరని తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు బాగా అందుతాయి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది బరువు కూడా తగ్గొచ్చు. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. పీరియడ్స్ టైం లో మహిళలు గోంగూరని తీసుకుంటే నీరసం బాగా తగ్గుతుంది. అలానే శక్తి లభిస్తుంది. గోంగూరని తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. గోంగూరని తీసుకుంటే ఇలా అనేక లాభాలని పొందొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news