వైఎస్ వివేకా హత్య కేసు.. హైకోర్టులో నిందితుల పిటిషన్

-

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. వివేక హత్యపై జాతీయ మీడియా సైతం దృష్టి సారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చల్లోకి ఎక్కింది. హత్య జరిగి నాలుగు సంవత్సరాల తర్వాత కూడా సిబిఐ ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతిని సాధించలేదని ఆంగ్ల వెబ్ సైట్ ది వైర్ పలు కోణాలలో అనుమానాలను వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా వివేకా హత్య కేసు నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 18 కి వాయిదా వేసింది. అయితే జూన్ 9న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్లను సిబిఐ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news