ప్రెగ్నెంట్ లేడీస్ కి గుడ్ న్యూస్…!

ఆడవాళ్ళు గర్భిణిగా ఉన్న సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఆహారం గురించి అనేక నియమాలు పాటిస్తూ ఉంటారు. అవి తినకూడదు ఇవి తినకూడదు అంటూ వైద్యులు సలహాలు ఇస్తూ ఉంటారు. దీనితో స్త్రీలు అంతా పక్కాగా ఉండే విధంగా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. ఇందులో భాగంగానే వారికీ ఒక సలహా.

చాక్లెట్స్ కొందరు తినకూడదు అంటారు గాని తినవచ్చు అని చెప్తున్నారు నిపుణులు. ప్రెగ్నెంట్స్ వీటిని తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. దీనివల్ల గర్భాశయం ఆరోగ్యకరంగా మారుతుందని… ఈ కారణం వల్ల హెల్దీ బేబీ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వీటిని ఎక్కువగా తినకూడదని… కాస్త మోతాదులో తింటే ఏ ఇబ్బంది ఉండదు అని ఇక దొరికిందే సందు అని తింటే ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో తమ డైట్‌‌‌లో చాక్లెట్స్‌ని చేర్చుకోవాలి. దీని వల్ల ఒత్తిడి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఎందుకంటే వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. లో బ్లడ్ ప్రజెర్ కూడా తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. తినేవి కూడా మంచి బ్రాండ్‌వి తీసుకోవాలి. అంతే కానీ, మార్కెట్లో దొరికే అన్ని బ్రాండ్స్ తినవద్దు అని చెప్తున్నారు.