హ్యాంగ్ ఓవర్ గా వుందా..? అయితే ఈ అల్పాహారాన్ని తీసుకోండి..!

-

ఒక్కొక్క సారి ఉదయం లేవగానే హ్యాంగ్ ఓవర్ ఉంటూ ఉంటుంది. దాని నుండి బయట పడటం కష్టమవుతుంది. పైగా హ్యాంగ్ ఓవర్ లో ఉండడం వలన మన పనులను మనం చేసుకోలేము. ఉద్యోగానికి కూడా వెళ్లలేని పరిస్థితి వస్తుంది. మీకు కూడా హ్యాంగ్ ఓవర్ గా ఉందా..? అయితే ఇలా చేయండి. అప్పుడు కచ్చితంగా హ్యాంగ్ ఓవర్ నుండి బయటపడొచ్చు. మరి హ్యాంగ్ ఓవర్ నుండి ఎలా బయట పడచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

 

మనం హ్యాంగ్ ఓవర్ లో ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది.
రక్తంలో గ్లూకోస్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడానికి పిండి పదార్థాలు, ప్రోటీన్, ఫ్యాట్స్ తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వలన హ్యాంగోవర్ సమస్య నుండి బయట పడడానికి అవుతుంది.
ఈ సమస్య తో బాధపడుతున్నట్లయితే జ్యూస్ ని స్కిప్ చేయండి. ఉదయం పూట పండ్ల రసాలు తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడలేము. ఉదయాన్నే జ్యూస్ ని తీసుకోవడం వలన ఇది మరింత ఇబ్బందికరంగా ఉంటుంది.
కాఫీ లేదా అల్లం టీ ని మీరు ప్రిఫర్ చేయండి. వీటిని తీసుకోవడం వలన తలనొప్పి తగ్గుతుంది. అలానే కాస్త రిలీఫ్ గా అనిపిస్తూ ఉంటుంది.
అలానే శరీరంలో కోల్పోయిన పోషకాలు, ఎలక్ట్రోలైట్లు ని మీరు తిరిగి పొందడానికి చూడాలి. హ్యాంగ్ ఓవర్ తో బాధపడే వాళ్ళు పొటాషియం ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండాలి.
పొటాషియం ని కూడా తీసుకునేలా చూడండి.

గోధుమ టోస్ట్‌ తో రెండు గుడ్లు:

హ్యాంగ్ ఓవర్ తో బాధపడే వాళ్ళు గోధుమ టోస్ట్‌ తో రెండు గుడ్లు తీసుకుంటే మంచిది.

అవకాడో లేదా కూరగాయలతో టోస్ట్:

లేదంటే మీరు అవకాడో లేదా కూరగాయలతో టోస్ట్ చేసి తీసుకోవచ్చు. వీటితో పాటుగా మీరు ఒక అరటి పండు కూడా తినండి.

Read more RELATED
Recommended to you

Latest news