సీజనల్ గా దొరికే ఈ పండును తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలుసా? ఇది ఒక ఔషధ ఫలం. వేసవిలో అయితే ఈ పండును తినడం వల్ల ఎండ నుంచి ఉపశమనం కలుగుతుంది.
నేరేడు పళ్లు. నల్లటి రంగులో రోడ్డు మీద మనల్ని ఆకర్షిస్తుంటాయి. వాటిని చూడగానే నోరూరుతుంది. ఒకసారి తియ్యగా.. మరోసారి పుల్లగా.. రెండు మూడు రకాల టేస్ట్ తో ఉండే నేరేడు పండు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయట. ఇది సీజనల్ ఫ్రూట్. సంవత్సరం మొత్తం లభించదు. ఎక్కువగా వేసవి కాలం చివర్లో దొరుకుతాయి. ఒక్కోసారి వర్షాకాలంలోనూ దొరుకుతాయి.
సీజనల్ గా దొరికే ఈ పండును తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలుసా? ఇది ఒక ఔషధ ఫలం. వేసవిలో అయితే ఈ పండును తినడం వల్ల ఎండ నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. పేగుల్లో ఉండే వెంట్రుకలను కడా ఇది బయటికి పంపించేస్తుంది. జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. విరోచనాలు కలిగినప్పుడు ఈ పండు తీసుకుంటే విరోచనాలు ఆగిపోతాయి. నేరేడు పళ్లను రోజూ కనీసం 10 నుంచి 20 పళ్ల వరకు తింటే ఎంతో మంచిది.
ముఖ్యంగా కిడ్నీలలో రాళ్లు ఏర్పడిన వాళ్లు నేరేడు పళ్లను తరుచుగా తింటే చాలా మంచిది. కిడ్నీలలోని చిన్న రాళ్లను ఇది కరిగిస్తుంది. మూత్రం రాక ఇబ్బంది పడేవాళ్లు కూడా ఈ పండును తరుచుగా తినొచ్చు.
కడుపులో ఉండే నులి పురుగులను ఈ పండు తరిమేస్తుంది. కడుపులోని చెత్తాచెదారాన్నంతా కరిగించే గుణం నేరేడు పండుకు ఉంటుంది.