పల్లీ చిక్కి ఎంత ఆరోగ్యకరమో ఇప్పుడే తెలుసుకోండి..!

-

సరదాగా పల్లీ చిక్కి తినేస్తూ ఉంటాం కానీ అది ఎంత ఆరోగ్యమో తెలీదు చాలా మందికి. మరి పల్లీ చిక్కి ఎంత ఆరోగ్యకరమో తెలియక పోతే ఇప్పుడే తెలుసుకోండి. వీటి రుచికి దాసోహమైపోయి కొద్దిగా ఎక్కువ తింటే మాత్రం కాన్స్టిపేషన్ వంటి సమస్యలు వస్తాయి గుర్తుంచుకోండి. పల్లీ చిక్కి వల్ల శరీరానికి మంచి ఐరన్ లభిస్తుంది. బిస్కెట్స్ వగైరా వాటి కంటే కూడా వీటిని అలవాటు చెయ్యడం మంచిది. కనుక ఇంట్లో రోజు చిన్న పిల్లలకి అలవాటు చెయ్యండి. వారు చాలా పుష్టిగా అవుతారు. వాహ్ ఎన్ని ప్రయోజనాలా కదా..!

అంతే కాదండి ఇందులో ఉండే బీ ప్రొఫైల్, మినరల్స్ వల్ల ఇది ప్యూబర్టీ సమయం లో హెల్ప్ చేస్తుంది, పీరియడ్స్ టైమ్ లో వచ్చే క్రాంప్స్ ని మ్యానేజ్ చేయడం లో కూడా బాగా తోడ్పడుతుంది. వేరు శనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ ని ప్యూరిఫై చేయడం లో హెల్ప్ చేస్తాయి. పల్లీల్లో ఉండే సెలీనియం, బెల్లం లో ఉండే మెగ్నీషియం, ఐరన్ కలిసి పునరుత్పత్తి సమస్యలను పరిష్కరించడంలో సాయం చేస్తాయి. అలానే కండరాలను బలోపేతం చేస్తాయి కూడా.

హీమోగ్లోబిన్ డెఫిషియెన్సీ ని తగ్గించి ఎనీమియా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది వేరుశనగ. వేరు శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పల్లి చిక్కిని ప్రత్యేకించి, అథ్లెటిక్స్ వంటి వాళ్ళకి మరీ మంచిది. వేరు శనగల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. మైక్రో మినరల్స్, విటమిన్స్, పాలీఫెనాల్స్ అన్ని కలగలిసిన సూపర్ ఫుడ్ ఇది. ఇందులో ఉండే ఎస్సెన్షియల్ ఫ్యాట్స్ వల్ల గుండెకీ, బోన్స్ కీ కూడా మేలు చేస్తుంది. చూసారా ఎన్ని ప్రయోజనాలో మరి మీ పిల్లకి ఇప్పుడే అలవాటు చెయ్యండి.

 

Read more RELATED
Recommended to you

Latest news