పందిరి దోసకాయలు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా..?

దోసకాయల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందు లోను పందిరి దోసకాయ వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల పోషక విలువలు ఒంటికి బాగా పడతాయి. వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. అనేక ప్రయోజనాలు కలిగే దోసకాయల గురించి పూర్తిగా ఇపుడే తెలుసుకుని మీ డైట్ లో చేర్చి ఆరోగ్యంగా ఉండండి.

పందిరి దోస ఫైబర్ కలిగి ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా తినడం కష్టం. కొంచెం తింటే చాలు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. వీటిని కనుక తింటే మీరు బరువు పెరగకుండా ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి బాగా సహాయ పడతాయి. అంతే కాదండి ఇది మీ బొడ్డు చుట్టూరా ఉండే కొవ్వును తగ్గిస్తుంది. అదే మీరు కనుక వీటి విత్తనాలని తీసుకుంటే…. అజీర్ణ చికిత్సకు సహాయ పడటమే కాక, పేగుల ఆరోగ్యంగా కూడా మెరుగు పడుతుంది. పందిరి దోస కనుక తీసుకుంటే ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుచుకోవచ్చు.

వీటిలో విటమిన్- కె, కాల్షియం వంటి అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. వీటి వల్ల ఎముకలకు కావలసిన సాంద్రత అందుతుంది. పందిరి దోస కాయ లో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. రక్తపోటు, గుండె జబ్బులను నియంత్రిస్తుంది. ఇది అధిక రక్తపోటు రాకుండా ఉంచుతుంది. దీని వల్ల గుండెకు ఒత్తిడి తగ్గుతుంది. విటమిన్-ఎ వంటి ఖనిజాలు పందిరి దోసకాయ లో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బీటా కెరోటిన్, సి లు ఎక్కువగా ఉండట తో దీంట్లో క్యాన్సన్ నిరోధక కారకాలు ఎక్కువగా ఉంటాయి. పందిరి దోసకాయ గర్భాశయ, ఉదరం, రొమ్ములకు సంబంధించిన కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది.