ఒక కప్పు ఆకుకూరలతో ఈ సమస్యలకి చెక్ పెట్టేయండి…!

-

రోజూ ఒక కప్పు ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. న్యూ ఎడిథ్ కోవాన్ యూనివర్సిటీ ఈసియు తాజాగా చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక కప్పు నైట్రేట్ కలిగిన కూరగాయలు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావు అని చెప్తున్నారు. నైట్రేట్ ఎక్కువగా ఉన్న కూరగాయలు అంటే ఆకుకూరలు మరియు బీట్ రూట్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది.

సంవత్సరానికి కార్డియో వాస్క్యులర్ సమస్యల తో 17.9 మిలియన్ల మంది చనిపోతున్నారు. వీటి ప్రకారం రీసర్చ్ చేస్తే… నైట్రైట్ ఉన్న కూరగాయలు తీసుకోవడం వల్ల 2.5 ఎంఎంహెచ్జి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని తెలుస్తోంది. తద్వారా హృదయ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఒక కప్పు నైట్రేట్ ఉన్న కూరగాయలని పచ్చివి లేదా ఉడికించుకున్న తీసుకున్నా మంచి ఫలితాలు కనబడతాయి. వీటితో కార్డియో వాస్క్యూలర్ సమస్యలు ఉండవు. నైట్రేట్ లెవెల్స్ కోసం సప్లిమెంట్స్ తీసుకోవడం కంటే రోజుకి ఒక కప్పు ఆకుకూరలు తీసుకుంటే సరిపోతుంది.

నిజంగా ఇది గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. ఆ తర్వాత నైట్రేట్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళని కూడా తీసుకుని రీసెర్చ్ చేశారు బచ్చలి కూర తో పాటు అరటిపండు లేదా బెర్రీస్ స్మూతీ తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

వాటిని బ్లెండ్ చేసి తీసుకోవడం వల్ల మంచిదే కాని ఆ పల్ప్ ని మాత్రం తొలగించకుండా తీసుకోవాలి. ఆకుకూరలు తీసుకోవడం వల్ల మజిల్స్ బలంగా ఉంటుందిమరియు కార్డియో వాస్కులర్ హెల్త్ కూడా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news