Health Tips : ప్రస్తుతం మన ఆహార విషయంలో ఎన్నో రకాల మార్పులు చోటుచేసుకున్నాయి. ఇలా మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎన్నో రకాల వ్యాధులు కూడా మనల్ని వెంటాడుతున్నాయి. ఇలాంటి సమస్యలలో చెడు కొలెస్ట్రాల్ సమస్య కూడా ఒకటి. ఇలా చెడు కొలెస్ట్రాల్ అధికంగా పెరిగిపోవడం వల్ల ఊబకాయానికి దారి తీయడమే కాకుండా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మనం ప్రతిరోజు వంటలలో ఉపయోగించే వాటిలో కొత్తిమీర ఒకటి. ఈ కొత్తిమీరను వంటలలో ఉపయోగించడం వల్ల వంటకు ఎంతో మంచి సువాసన రుచి రావడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు.కొత్తిమీర ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఇ అధికంగా ఉన్నాయి. వీటితో పాటు విటమిన్ ఏ మరియు విటమిన్ కే కూడా ఉన్నాయి. ఇవి మనకు రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా చాలా అనారోగ్య సమస్యల నుంచి మనల్ని దూరం చేస్తుంది.
ఈ విధంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి కొత్తిమీరను జ్యూస్ చేసుకుని ఉదయం పరగడుపున తాగటం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ రేటును పెంపొందింప చేసి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అదే విధంగా మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. ఇలా చెడు కొలెస్ట్రాలను కరిగించడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. అదేవిధంగా కీళ్లు నొప్పులు, వాపు వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఈ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.