త్రిఫల చూర్ణం వాడితే ఇన్ని ఉపయోగాలా…!

-

మనదేశంలో అనేక ఔషధ గుణాలున్న మూలికలు లభిస్తాయి. అయితే వాటిని ఎలా వాడాలో మనకు తెలియదు. చాలావరకు ఆయుర్వేద ఔషధాలలో ఈ మూలికలను ఉపయోగిస్తారు. మూలికలు మాత్రమేకాక రకరకాల ఫలాలు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిలో చెప్పుకోదగ్గవి, మన ఆరోగ్యాన్ని రక్షించే మూడురకాల ఫలాలను త్రిఫల చూర్ణం. ఉసిరి కాయ, తాని కాయ, కరక్కాయ ఈ మూడిoటిని మెత్తనిపొడి చేస్తే దాన్ని త్రిఫల చూర్ణం అంటారు. దీన్ని తగు మోతాదులో ప్రతినిత్యం వాడితే మన శరీరం సక్రమంగా పనిచేస్తుంది. అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు.

ఈ త్రిఫలా చూర్ణంలో ఉన్న యాంటి ఆక్సిడెంట్లు, యాంటి బ్యాక్టీరియా గుణాలు సమృద్దిగా ఉన్నాయి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంగ్లీషు మందులను తట్టుకునే బ్యాక్టీరియా ను తరిమి కొట్టే సామర్థ్యం ఉందని పరిశోధనల్లో తేలింది. ఈ చూర్ణాన్ని పరగడుపున లేదా రాత్రి పడుకొనేటప్పుడు గోరు వెచ్చని నీటిలో 5 గ్రాములు కలిపి తాగవచ్చు. లేక పోతే చిన్న చిన్న గోలీలు చేసి సేవించవచ్చు. ఈ త్రిఫల చూర్ణం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఆకలి పెరుగుతుంది. యసిడిటి, గ్యాస్ సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది.

ఇంకా ఈ చూర్ణం ప్రతిరోజు వాడటం వల్ల కళ్ళు, చర్మం, గుండె, మరియు శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. ఒక వేల ఆల్రెడీ ఉంటే అదుపులో ఉంచుతుంది. రక్త హీనత ఉన్నవారిలోఎర్ర రక్త కణాలను పెంచుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అధిక బరువుని నియంత్రిస్తుంది. చర్మ కణాలను కాపాడి క్యాన్సర్ వంటి ప్రాణాoతక వ్యాధులు రాకుండా చేస్తుంది. బిపి కంట్రోల్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. త్వరగా ముసలితనం రాదు. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news