అలర్ట్: పన్నీర్ లో కల్తీ, ఫేక్ పన్నీరును ఎలా గుర్తించాలో తెలుసుకోండి

-

కల్తీ.. కల్తీ.. కల్తీ.. ఈ మధ్య ఆహార పదార్థాల కల్తీ ఎక్కువగా జరుగుతుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. చిన్న పిల్లలకు పట్టించే పాల పౌడర్ల నుండి  మొదలుకుని వంటనూనెల వరకు అన్నింట్లోనూ కల్తీ జరుగుతూనే ఉందని వినిపిస్తోంది.

తాజాగా పన్నీర్ లోని కల్తీ బయటపడింది. అవును.. మార్కెట్ లో ఫేక్ పన్నీర్ విస్తారంగా దొరుకుతోంది. చూడడానికి ఒరిజినల్ లాగానే కనిపించే ఈ పన్నీర్ ని ఎలా గుర్తు పట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఒరిజినల్ పన్నీర్ కి ఫేక్ పన్నీర్ కి మధ్య ఎలాంటి తేడా ఉంటుందో తెలుసుకుందాం.

సాధారణంగా పన్నీరును చూడగానే, లేదా దాన్ని ముట్టుకోగానే అది ఫేకేనా కాదా అని కనుక్కోవచ్చు. ఫేక్ పన్నీర్ ని శుభ్రమైన చేతులతో గట్టిగా టచ్ చేస్తే ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. అయితే ఫేక్ పన్నీర్ ని గుర్తించేందుకు ఖచ్చితమైన పద్దతి కాదు.

అయోడిన్ టింక్చర్:

ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని అందులో పన్నీరు వేసి మరిగించండి. అది ఉడికిన తర్వాత చల్లార్చి.. అప్పుడు అయోడిన్ టింక్చర్ చుక్కలను ఆ నీటిలో వేయండి. పాత్రలోని పన్నీరు.. బ్లూ కలర్ లోకి మారితే ఆ పన్నీర్ ఫేక్ పన్నీర్ అని చెప్పవచ్చు.

కందిపప్పు :

ఇక్కడ కూడా సేమ్ పన్నీరును నీళ్ళలో ఉడికించి, చల్లారిన అందులో కందిపప్పు పొడిని వేయండి. పన్నీర్ ముక్కల రంగు లేత ఎరుపు రంగులోకి మారితే అది ఫేక్ పన్నీర్ అని చెప్పవచ్చు.

సోయాబీన్ పౌడర్:

పన్నీరును నీటిలో ఉడికించి.. సోయాబీన్ పౌడర్ ని అందులో వేస్తే పన్నీరు రంగు మారిపోతే అది ఫేక్ పన్నీరు అని అర్థం.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news