కొవ్వుని కరిగించి, హృదయ ఆరోగ్యాన్ని పెంపొందించే మూలికలివే..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం బాగుండాలి. అదే విధంగా సరైన జీవన విధానం ఫాలో అవుతూ ఉండాలి. ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో బాధ పడుతున్నారు. అయితే ఈ బాధలు ఉండకుండా ఉండాలంటే ఆయుర్వేద మూలికలను ఉపయోగించండి.

 

అర్జున:

అర్జునని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. హైబీపీ సమస్యని ఇది తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ సమస్యలు ఉన్న వాళ్లు అర్జునని తీసుకోవడం మంచిది.

ఉసిరి:

ఉసిరి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు విటమిన్ సి యాంటి ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ కూడా ఇది తగ్గిస్తుంది. చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడుతూ వుంటారు. అటువంటి వాళ్ళు ఉసిరి ని రెగ్యులర్ గా ఏదో రూపం లో తీసుకుంటూ వుండండి. దాంతో చక్కటి లాభాలను పొందొచ్చు.

పసుపు:

వంటల్లో పసుపు ఉపయోగిస్తే ఎంతో మంచిది. పసుపు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది. అజీర్తి సమస్యలను పోగొడుతుంది.

అల్లం:

అల్లం కూడా కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. సర్క్యులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి వీటిని తరచూ తీసుకుంటూ ఉండండి. దానితో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా వుండవు. దాంతో గుండె సమస్యలేమీ ఉండకుండా ఆరోగ్యంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news