డయాబెటీస్‌ వల్ల వచ్చే చర్మరోగాలకు ఇలా చెక్‌ పెట్టండి!

-

డయాబెటీస్‌ మగ, ఆడ, పిల్లలు అనే తేడా లేకుండా అందరిలో వచ్చే డిసీజ్‌. ఇది దీర్ఘకాలిక వ్యాధి. రక్తంలో చక్కెర స్థాయిలో వచ్చే మార్పుకు మీ శరీరం లోపలి అవయవాలతో పాటు చర్మంపై కూడా దీని ప్రభావం పడుతుంది. చాలా మంది డయాబెటీస్‌ రోగులకు స్కిన్‌ డిసీజ్, ఇతర చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడతారు. ఒకవేళ డయాబెటీస్‌ లేని వారికి కూడా వాళ్లలో డయాబెటీస్‌ ప్రారంభంమవుతే కూడా స్కిన్‌ డిసీజ్‌ వల్ల ఇండికేషన్‌లు కూడా తెలుసుకోవచ్చు. అయితే మనం తీసుకునే మెడిసిన్‌లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని ప్రముఖ డెర్మటాలజిస్ట్‌ డాక్టర్‌ రింకీ కపూర్‌ సూచించారు.

diabetes

డయాబెటీస్‌ వల్ల ఎటువంటి చర్మ సమస్యలు వస్తాయి?

  • దాదాపు 75 శాతం ప్రపంచ జనాభాలో టైప్‌–2 డయాబెటీస్‌ చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. షుగర్‌ వల్ల కొత్త చర్మ వ్యాధులు వస్తాయి, అదేవిధంగా పాత చర్మం పాడైపోతుందని రింకీ కపూర్‌ తెలిపారు.
  • డయాబెటీస్‌ వల్ల గ్లూకోజ్‌ లెవల్‌ రక్తంలో ఎక్కువై, రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలోని నరాలకి చాలినంత న్యూట్రియెంట్స్‌ లభించవు, తెల్ల రక్తకణాలు సైతం తమ శక్తిని కోల్పోతాయి.
  • రక్తప్రసరణ తగ్గడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుముఖం పట్టవు. వాటì పై రాపిడి చేసిన ఎఫెక్ట్‌ పడుతుంది.
  • డ్యామేజ్‌ అయిన కణాలు పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అలాగే టెంపరేచర్, ప్రెషర్‌ పెరిగి, చర్మం సెన్సిటివిటీని కూడా కోల్పోతుంది.

మార్పులు గమనించండి..

మొదటి దశలోనే చర్మ సంబంధిత వ్యాధుల మార్పులను గమనిస్తే డయాబెటీస్‌ వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని డాక్టర్‌ కపూర్‌ సూచిస్తున్నారు.

సాధారణంగా వచ్చే చర్మ సంబంధిత వ్యాధులు..

చర్మం పొరిబాడటం, ఎరుపు రంగులోకి మారడం, కాళ్లు, చేతులకు దురదలు రావటాన్ని గమనించాలి.

  • ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ కూడా వ్యాపిస్తుంది. కాలి వేళ్ల మ«ధ్యలో, మోచేతులు, పేదల మూలల్లో ఇన్ఫెక్షన్‌ ప్రభావం ఉంటుంది.
  • చిన్న మచ్చలు వచ్చి సా«ధారణ స్పాట్స్‌ లాగానే ఉంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి దారుణంగా మారుతుంది.
  • చర్మాన్ని ఎల్లప్పుడు క్లీన్‌ గా ఉంచుకోవాలి.
  • ఏవైనా సమస్యలు వస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
  • ప్రతిరోజు రెండు సార్లు చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేసుకోవాలి.
  • లిప్‌బామ్‌ వాడాలి
  • నీరు ఎక్కువ తాగాలి.
  • ఎస్‌పీఎఫ్‌ 40 సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడాలి.
  • చర్మంపై ఏవైనా గాయాలు అయితే వెంటనే చికిత్స చేయించుకోవాలి.
  • మీరు తీసుకునే ఆహారంలో దాల్చిన చెక్క, జామున్, అవోవెరా, బెర్రీస్, టోమాటో, ఉసిరి, పెరుగు, లెమన్‌గ్రాస్‌ ఉండేలా చూసుకోవాలి.

హోం రెమిడీస్‌..

  • రెండు స్పూన్ల తేనే, సగం చెంచా పసుపు కలిపిన ఫేస్‌ ప్యాక్‌ను వాడాలి.
  • 15–20 ని.. తర్వాత కడిగాలి. తేనే వల్ల చర్మం మాయిశ్చర్‌ అవుతుంది.
  • పెదాలకు నెయ్యిని రాయాలి. దీనివల్ల లిప్స్‌ డ్రై అవ్వవు.
  • చర్మానికి ఓట్‌మిల్‌ను రాసుకోవడం మంచిది.
  • స్నానం చేసే నీటిలో పావు వంతు బేకింగ్‌ సొడాను కలిపాలి. దీనివల్ల ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ రావు.

 

Read more RELATED
Recommended to you

Latest news