చేతి వేళ్లు చూసి గుండె జ‌బ్బు చెప్పేయొచ్చ‌ట‌

-

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. వాస్త‌వానికి ఇప్పటి వరకూ మగవారికంటే ఆడవారికి గుండెపోటు ప్రమాదం తక్కువని ప్రచారంలో ఉంది. అయితే గుండెజబ్బు లక్షణాలకు లింగ భేదాలు ఉండవని వెల్లడైంది. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది.

అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. అయితే తాజా ప‌రిశోధ‌న ప్ర‌కారం చేతి వేళ్త‌ను బ‌ట్టీ కూడా గుండె జ‌బ్బు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ట‌. గుండె పోటుతో మరణించిన దాదాపు 200 మందిని పరిశీలించి త‌ర్వాత వారందరిలో ఎక్కువ శాతం ఒక కామన్‌ విషయం ఉండటం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యానికి గురిచేంది.


సాధార‌ణంగా చేతికి ఉన్న అన్ని వేళ్లలో మధ్య వేలు పెద్దగా ఉంటుంది. ఆ తర్వాత ఉంగరపు వేలు పెద్దగా ఉండి, ఆ తర్వాత చూపుడు వేలు పెద్ద‌గా ఉంటుంది. కాని కొందరిలో ఈ మూడు వేళ్లు సమానంగా ఉండటం లేదా ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు పెద్దగా ఉండటం జరుగుతుంది. ఇలా ఉన్న వారిలో ఖ‌చ్చితంగా 80 నుండి 90 శాతం మందికి గుండె జ‌బ్బులు వ‌చ్చ అవ‌కాశం ఉంద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. 35 నుండి 80 ఏళ్ల లోపు వారిలో ఎక్కువగా ఈ లోపం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

అయితే ఇది అంద‌రికి వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌లేదు. వేళ్లు సరిగ్గా లేనంత మాత్రాన గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని కాదు.. వేళ్లు స‌రిగ్గా ఉన్నంత మాత్రాన గుండె జ‌బ్బులు రావ‌ని కాదు. ఎక్కువ శాతం మందికి ఇలా జ‌రిగింద‌ని వెల్లండించారు. ఆహార జాగ్ర‌త్త‌లు, జీవ‌న శైలి స‌క్ర‌మంగా ఉంటే.. వేళ్లు ఎలా ఉన్నా గుండె జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని నిపుణులు స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news