పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాల తరలింపు అంశంపై అధికారపక్షం జగన్ సర్కార్ చేస్తున్న పనులపై సీమ వాసుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ సమయంలో జగన్ కు అనుకూలంగా, సీమ ప్రజలవైపు బీజేపీ, కమ్యునిస్టులు మాట్లాడుతుండగా… ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం జగన్ పై రాజకీయ విమర్శలు చేస్తుంది. ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ అని చెప్పాలి. ఇంత సీరియస్ వ్యవహారంపై బాబు అండ్ కో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు.. అసలు వారి మాటలు ఎలా ఉన్నాయి… అనేది ఇప్పుడు చూద్దాం!
తెలంగాణ ప్రభుత్వంతో న్యాయపోరాటం చేసి అయినా సరే రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇదే సమయంలో కృష్ణా మిగులు జలాలను రాయలసీమకు అందించాలనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయమని.. ఈ జీవో నెంబరు 203 విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గవద్దని సూచిస్తోంది. అక్కడితో ఆగకుండా… ఈ విషయంలో అవసరమైతే రాష్ట్ర బీజేపీ తపురున కేంద్రప్రభుత్వానికి విన్నవిస్తామని కూడా భరోసా ఇస్తుంది. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు చేసుకున్నా… రాష్ట్రం మొత్తానికి పక్క రాష్ట్రం నుంచి సమస్యలు వస్తున్నప్పుడు ప్రతిపక్షాలు.. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇలా ఉండాలి!
ఇదే విషయంలో… ఈ వ్యవహారంపై మరింత చర్చించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని… ఈ వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఉమ్మడి కృషి కొనసాగించేలా చొరవచూపాలని సీపీఐ, సీపీఎం లు ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో జగన్ ఏమాత్రం మెతక వైఖరి ప్రదర్శించకూడదని.. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కర్నూలులో చేసిన జలదీక్ష చేపట్టిన సంగతిని గుర్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ! ఇలా అన్ని పక్షాలు రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో జగన్ కు మద్దతుగా, సీమ ప్రజలకు అండగా నిలబడుతుంటే… టీడీపీ మాత్రం ఈ విషయంపై రాజకీయ విమర్శలు మినహా మరోమాట చెప్పకపోవడం గమనార్హం!
ఈ వ్యవహారంపై కేసీఆర్ – జగన్ కలిసి నాటకాలాడుతున్నారని… కరోనా కేసుల విషయంలో ప్రజల దృష్టి మరల్చడానికే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తున్నారు. అంతే తప్ప… రాయలసీమ ప్రజల తరుపున మాత్రం ఒక్క పాజిటివ్ మాట కూడా మాట్లాడటం లేదు. ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వస్తుందో చూద్దాం అంటూ శ్రేణులకు జూం యాప్ ద్వారా పిలుపునిస్తున్నారు. అంటే… కర్ర్రా ఇరగకుండా పాము చావకుండా ఇంతకాలం చేసిన రాజకీయమే బాబు .. తాను మాత్రమే చేయకుండా మిగిలిన వారికీ నేర్పించే పనికి పూనుకున్నారు. ఇలాంటి కీలక విషయాల్లో కూడా బాబు ఒక స్టాండ్ తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి!!