Drinking water: మంచినీళ్లు తాగేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటీ మంచినీళ్లు తాగడంలో కూడా ఎవరైనా తప్పులు చేస్తారా అని ఆలోచిస్తున్నారా..? అవును నిలబడి మంచినీళ్లు తాగడం నిజంగా తప్పు. నిలబడి మంచినీళ్లు తాగడం వలన చాలా సమస్యలు వస్తాయి. జీర్ణ సమస్యలు మొదలు అనేక ఇబ్బందులు కలుగుతాయి. నీళ్లు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మంచినీళ్లు సరిగ్గా తీసుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది. జీర్ణ సమస్యలు, సర్కులేషన్, టెంపరేచర్ రెగ్యులేషన్, పోషకాల అబ్సెర్ప్షన్ ఇటువంటి వాటికి నీళ్లు చాలా ముఖ్యం. హైడ్రేట్ గా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. చర్మం బాగుంటుంది. కిడ్నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి కూడా శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి. అయితే నిలబడి మాత్రం అస్సలు తాగకూడదు.
నిలబడి నీళ్లు తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు:
అజీర్తి సమస్యలు:
నిలబడి మంచినీరు తాగడం లేదా నడుస్తూ మంచినీళ్లు తాగడం మంచిది కాదు. ఇలా నీళ్లు తాగడం వలన బ్లోటింగ్ మొదలైన జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
కిడ్నీ ఫంక్షన్:
నిలబడి నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదు. కిడ్నీ స్టోన్స్ లేదా కిడ్నీ సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది.
ఎముకల ఆరోగ్యం:
నిలబడి నీళ్ళు తాగితే ఎముకల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందట. ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా రావచ్చు.
గుండె ఆరోగ్యం:
నిలబడి లేదా నడుస్తూ నీళ్లు తాగడం వలన గుండె ఆరోగ్యం పాడవుతుంది.
నరాలపై ప్రభావం:
నిలబడి నీళ్లు తాగడం వలన నరాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. హైబీపీ టెన్షన్ వంటి సమస్యలు కూడా కలుగుతాయి. కాబట్టి ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చుని నీళ్లు తాగడం మంచిది. నిలబడి నీళ్లు తాగడం వలన గొంతులో ఇబ్బందులు, బ్లోటింగ్, గ్యాస్, డిస్ కంఫర్ట్ వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ తప్పు చేయొద్దు.