ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని పాటించాల్సిందే…!

Join Our Community
follow manalokam on social media

కొంత మంది ఎలా బరువు తగ్గాలి అని బాధ పడుతూ ఉంటే మరి కొందరు ఎలా పెరగాలి అని బాధ పడుతుంటారు. బరువు పెరగాలి అనే ఆలోచనతో ఎక్కువ మోతాదులో అన్ని ఆహార పదార్థాలు తినడం సరైన పద్ధతి కాదు. బరువు తగ్గడం లేదా బరువు పెరగడం ఏదైనా సహజంగా మరియు ఆరోగ్యంగా ప్రయత్నించాలి. అలా కాకుండా అధికమైన కొవ్వు పదార్థాలు తీసుకోవడం చేస్తే సన్నగా ఉన్న వారిలో కూడా కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుంది. అది శరీరానికి అస్సలు మంచిది కాదు. ఇలా చేస్తే భవిష్యత్తులో గుండె జబ్బులు, హై బీపీ మరియు డయాబెటిస్ వంటివి వస్తాయి.

ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉండేవారు వారు తీసుకునే ఆహార విధానం మార్చుకోవాలి.
అయితే థైరాయిడ్ , క్యాన్సర్ , డయాబెటిస్ వంటి వాటితో బాధపడేవారు రోజు రోజుకి బరువు తగ్గిపోతారు. అలాంటప్పుడు మీ డాక్టర్ సూచించిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి ఆహార నియమాలు వారు పెడతారు. కనుక కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించండి. సన్నగా ఉండేవారు నట్స్, డైరీ ప్రొడక్ట్స్, ప్రోటీన్, పండ్లు మరియు మాంసాహారం తీసుకోవచ్చు.

అలా అని ఎక్కువ క్యాలరీలు ఒకే రోజు తీసుకోకూడదు మరియు వంటలు లో ఎక్కువ నూనె వాడకూడదు. బటర్ లేదా నెయ్యి పరిమితిలో వాడుకోవచ్చు. ఆహారం తీసుకునే ముందు మంచి నీరు ఎక్కువగా తాగకూడదు. అలా చేయకపోతే ఎక్కువ ఆహారం తీసుకోలేకపోతారు. ప్రతిరోజు రెండు గ్లాసుల పాలు తాగడం మేలు. మంచి ఆహారం తో పాటు సరైన నిద్ర కూడా అవసరమే. ఇవన్నీ పాటిస్తూ మీ శక్తిని పెంచుకోవడానికి కార్డియో చేయండి. దాంతో మీరు బరువు పెరిగిన ఫిట్ గా ఉంటారు. అలా అని ఎక్కువ క్యాలరీలు వ్యాయామంలో ఖర్చు పెట్టద్దు.

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...