మీ అరచేతులు మృదువుగా మారాలంటే ఇలా చెయ్యండి…!

-

ముఖ సౌందర్యానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అవే జాగ్రత్తలు అరచేతుల సౌందర్యానికి కూడా తీసుకోవాలి. ఎక్కువగా పనులు చేయడం వల్ల అరచేతులు కఠినంగా మారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు ఉండడం, సరైన క్రీములను వాడకపోవడం, అధిక రసాయనాలు ఉన్న డిటర్జెంట్ లను వాడటం వల్ల చేతులు కటినంగా మారుతాయి.

మృదువైన అరచేతుల కోసం ఇవి తప్పక చేయండి:

ఒక టీస్పూన్ పంచదారలో, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు పాటు అర చేతులకు మర్దన చేయాలి. ఇలాగే క్రమం తప్పకుండా వారం రోజులు చేస్తే అర చేతులు మృదువుగా మారుతాయి.

శీతాకాలం లోనే కాకుండా ఎల్లప్పుడూ అర చేతులు పొడిబారతాయి. కాబట్టి ప్రతి రోజు తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవడం మేలు. ఇది మీ దినచర్య లో భాగంగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా అర చేతులు మృదువుగా అవుతాయి.

ఒక పాత్రలో కొద్దిగా తేనే, కోడిగుడ్డులోని తెల్ల సొన, ఒక టీ స్పూన్ గ్లిజరిన్ మరియు ఒక టీ స్పూన్ బార్లీ పొడి వేసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసుకుని 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటి తో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చేతులు మృదువుగా అవుతాయి.

ఇటువంటి చిట్కాలను పాటించడంతో పాటు రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగడం,
తాజా పండ్లు,కూరగాయలు తినడం అవసరం. ఇలా చేయడం వలన శరీరానికి తగినంత తేమ అందుతుంది దాంతో అరచేతులు మృదువుగా మారతాయి.

Read more RELATED
Recommended to you

Latest news