పోలీసులు వైసీపీ పాలేర్లుగా పని చేస్తున్నారు !

Join Our Community
follow manalokam on social media

కొద్ది సేపటి క్రితం టీడీపీ నేతలు ఎస్ఈసీ కార్యదర్శిని కలిశారు. ఎస్ఈసీకి చంద్రబాబు రాసిన లేఖను కార్యాలయంలో అందజేశారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్సీఅశోక్ బాబు మాట్లాడుతూ మాచర్ల, గురజాల,పుంగనూరు  నియోజక వర్గాల్లో టీడీపీ వారిని వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. అక్కడ వైసీపీ తప్ప మిగిలిన వారు నామినేషన్ వేసే పరిస్థితి లేదని అన్నారు. 3 నియోజకవర్గాల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరామని అన్నారు. అందరికీ నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని కోరామన్న ఆయన ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ పెట్టేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం  కార్యదర్శి హామీ ఇచ్చారని అన్నారు.

ఇక గతంలో ఎంపీటీసీ ఎన్నికల్లో  గుంటూరు జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో  బెదిరించి  వందశాతం ఏకగ్రీవాలు చేశారని, ఇప్పుడు కూడా అక్కడ అదే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మాచర్ల రూరల్ సీఐ భక్త వత్సల రెడ్డి సహా దుర్గి, వెల్దుర్తి, కారంపూడి, మాచర్ల, రెంటచింతల ఎస్సైలను సస్పెండ్ చేయాలని కోరామని ఆయన అన్నారు. పోలీసులు వైసీపీ పాలేర్లుగా పని చేస్తున్నారన్న ఆయన హైకోర్టులో మేము గెలిచామని వైసీపీ చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....