వేడి వేడిగా మష్రూమ్ సూప్!

-

ఈ చల్లని వర్షాకాలంలో వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది. టీ తాగితే సరిపోతుంది కదా అనకుంటారు. ఇది కాకుండా మరేదైనా సూప్ తాగాలి. అది కూడా ఆరోగ్యానికి ఉపయోగపడేలా మష్రూమ్ సూప్‌ను ఆరగించేద్దాం. ఇందులో ఉండే విటమిన్ డి ఉండడం ద్వారా ఇతరత్రా కాయగూరల్లో లభించని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు రక్తం శుద్ధికరించడంతోపాటు గుండె పనితీరు మెరుగవుతుంది.

కావాల్సినవి :
మష్రూమ్స్ : అరకిలో
ఉల్లిగడ్డ తరుగు : పావుకప్పు
వెన్న : 2 టేబుల్‌స్పూన్లు
మొక్కజొన్నపిండి : అరటీస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్
వాము పేస్ట్ : అర టీస్పూన్
చిక్కటి క్రీము : అరకప్పు
క్యారెట్ తరుగు : అర కప్పు
మిరియాలపొడి : 1 టీస్పూన్
కొత్తిమీర : సరిపడా
ఉప్పు : తగినంత.

తయారీ :
కడాయిలో వెన్న వేసి వేడి చేయాలి. అందులో కట్‌చేసిన మష్రూమ్స్ వేయించాలి. తగినంత ఉప్పు గోధుమరంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లితరుగు, అల్లం, క్యారెట్ తరుగువేసి మరికాసేపు వేయించుకోవాలి. అందులో వామువేసి కలియబెట్టాలి. సన్ననిమంటపై అరగంట పాటు ఉడికించాలి. తర్వాత చిక్కటి క్రీమ్ వేసి కలియబెట్టాలి. మిరియాలపొడి, కొత్తిమీర వేసి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి. ఈ సూప్‌కు కార్న్‌చిప్స్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news