భ‌క్తుల‌కు షాకిస్తూ టీటీడీ కీల‌క‌ నిర్ణ‌యం..!

-

తిరుమల శ్రీనివాసుని లడ్డూ ప్రసాదమంటే ఎంత పవిత్రమో అందరికీ తెలిసిందే. ఏడుకొండలూ ఎక్కి స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రతి భక్తుడూ లడ్డూ ప్రసాదం స్వీకరించకుండా కొండ దిగడు. అటువంటి లడ్డూ ధర ఇప్పుడు ఏకంగా రెట్టింపు కానుంది. ప్రస్తుతం లడ్డూల అమ్మకాలు రాయితీలపై సాగుతున్నాయి.లడ్డూల పంపిణీ, విక్రయాల్లో రాయితీలకు టీటీడీ మంగళం పాడనుంది.

అయితే, మార్కెట్ ధర ప్రకారం ఒక్కో లడ్డూ తయారీకి రూ. 40 వరకూ ఖర్చు అవుతుండగా, రాయితీ భారం తడిసి మోపెడు అవుతోందన్న ఉద్దేశంలో ఉన్న టీటీడీ, ఇకపై ఒక్కో లడ్డూను రూ. 50కి విక్రయించాలని భావిస్తోంది. అల‌గే, ఇకపై దర్శనం చేసుకున్న భక్తులందరికీ 160-180 గ్రాముల చిన్న లడ్డూ ఒకటి ఉచితంగా ఇవ్వాలని టీటీడీ భావిస్తోంది.ఆపై లడ్డూ కావాలంటే రూ. 50 పెట్టి కొనుక్కునేలా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news