ప్యాషన్ ఫ్రూట్ ఈ పండు చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది. దీన్ని తెలుగులో కృష్ణఫలం అంటారు. ప్యాషన్ ఫ్రూట్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ,సి పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్యాషన్‌ఫ్రూట్‌లో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.!
విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ప్యాషన్ ఫ్రూట్‌ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు ఫైబర్ అధికంగా ఉండే పాషన్‌ఫ్రూట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన పండు. ఇందులో ‘పెక్టిన్’ అనే ఒక రకమైన ఫైబర్ కూడా ఉంటుంది, ఇది కేలరీలను జోడించకుండా కడుపు నిండుగా ఉంచుతుంది. ఫైబర్ ఉండే ఆహారంలో వీటిని చేర్చుకోవడం కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
పాషన్‌ఫ్రూట్‌లో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరంలోని కండరాల పనితీరును నియంత్రిస్తుంది. ప్యాషన్ ఫ్రూట్ తొక్క గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్యాషన్ ఫ్రూట్‌లో ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కార్డియాక్ అటానమిక్ నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆస్కార్బిక్ యాసిడ్ పారాసింపథెటిక్ నాడీ పనితీరు బాగా జరిగేలా సహాయపడుతుంది.
ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ప్యాషన్‌ఫ్రూట్ జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారించేందుకు పాషన్ ఫ్రూట్‌ను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ మరియు ఫాస్పరస్ అన్నీ ప్యాషన్‌ఫ్రూట్‌లో ఉంటాయి. కాబట్టి ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ప్యాషన్ ఫ్రూట్ ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉన్న పాషన్‌ఫ్రూట్ చర్మ ఆరోగ్యానికి మరియు కంటి ఆరోగ్యానికి మంచిది. మాక్యులార్ డీజెనరేషన్, క్యాటరాక్ట్, నైట్ బ్లైండ్‌నెస్‌ను కూడా నివారిస్తుంది.
ప్యాషన్ ఫ్రూట్‌లో యాంటీక్యాన్సర్ గుణాలు ఉన్నాయి. ఈ పండు తరచుగా తీసుకుంటే.. గ్రాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది