వ్యాయామం చేస్తే.. ఆస్తమా వస్తుందా..?

-

వ్యాయామం: చాలా మంది ప్రతి రోజూ కూడా వ్యాయామం చేస్తారు. నిజానికి రోజూ ఒక అరగంట సేపు వ్యాయామం చేస్తే ఎంతో మంచిది.ఆరోగ్యం బాగుంటుంది. పలు రకాల సమస్యలు దూరం అవుతాయి. వ్యాయామం చేస్తే ఆస్తమా వస్తుందని చాలా మంది అనుకుంటారు. మరి వ్యాయామం చేస్తే ఆస్తమా వస్తుందా లేదా అనేది చూద్దాం.. ఆస్తమా చూడడానికి చిన్న సమస్యగా కనబడుతుంది కానీ ఆస్తమాతో బాధపడే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

నిజంగా భరించడం చాలా కష్టం. వ్యాయామం చేస్తే ఆస్తమా వస్తుందని కొంత మంది అభిప్రాయం. మరి అది నిజమా కాదా అనేది చూస్తే.. వ్యాయామం చేసినప్పుడు తీవ్రంగా అలసిపోతూ ఉంటాము శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆస్తమా ఉన్న వాళ్ళకి అది ఇంకా కష్టంగా ఉంటుంది. ఆస్తమా సమస్య తో ఉన్న వాళ్ళు వ్యాయామం చేస్తే ఊపిరితిత్తులోని శ్వాస నాళాలు కుషించుకుపోతాయి. దగ్గు, ఛాతి బిగుతుగా పట్టినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. కొంచెంసేపు ఇలా ఉండి తర్వాత మళ్ళీ నార్మల్ గా అయిపోతూ ఉంటారు.

ఆస్తమా తో బాధపడే వాళ్ళు చల్లని పొడి గాలి లో వ్యాయామం చేయడం వలన ఈ లక్షణాలు ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ తప్పును చేయకండి. ఎలర్జీ ఉన్నవాళ్లు పువ్వుల మొక్కలు, పువ్వులు గాలి ఉన్న చోట వ్యాయమం చేయకండి అయితే వ్యాయామం చేస్తే అందరికీ ఆస్తమా రాదు. వ్యాయామం చేసే వాళ్ళు ఆస్తమా ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. మీ రోజుల్లో ఒక 20 నిమిషాలు వ్యాయామం కోసం కేటాయిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. మన ఆరోగ్యం తీసుకునే ఆహారం జీవన శైలి నిద్ర వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటి కోసం సమయాన్ని కేటాయించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా జీవించండి.

Read more RELATED
Recommended to you

Latest news